Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు? మీకు తెలుసా? (2)
వారు ముగ్గురు ముగ్గురా వారు ముగ్గురూ ఒక్కరా (2)
ఎవరో… ఎవరో… ఎవరెవరో తెలుసునా?
||తండ్రి కుమార పరిశుద్ధాత్మ||
1. తండ్రీ యేసొకటి కాదు వారు ఇద్దరు వ్యక్తులుగా వేరు (2)
యెహోవా తండ్రి, యేసు తన కొడుకే, పరిశుద్ధాత్మ ఆ యేసు తమ్ముడే? (2)
కాలములు, సమయములు తండ్రియొద్దే ఉన్నవి
కాలము తెలియని యేసూ తండ్రొకటే కాదు
ఆ దినము ఆ గడియ యేసుకే తెలియదు
||తండ్రి కుమార పరిశుద్ధాత్మ||
2. తండ్రే, యేసుగా రాలేదు యేసు క్రీస్తే, పరిశుద్ధాత్మ కాదు (2)
తండ్రి పనిలోనే యేకమైనారు ముగ్గురు వేరని ఇప్పుడు తెలుసుకో (2)
అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే అతనికి పుట్టిన యేసు
తండ్రికి కుమారుడే? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురే
తండ్రి కుమార పరిశుద్ధత్మ వేరు మీకు తెలుసా? (2)
వారు ముగ్గురు ముగ్గురా కాదు ముగ్గురు ఒక్కరా? (2)
ఎవరో… ఎవరో… ఎవరెవరో తెలుసునా?
తండ్రి కుమార పరిశుద్ధత్మ వేరు మీకు తెలుసా? (2)
||తండ్రి కుమార పరిశుద్ధాత్మ||
Tandri Kumara Parishuddhatma Evaru Song Lyrics in English