Skip to content
Home » దేవుడే నిజమైన మన తండ్రి | Devude Nijamaina Mana Tandri

దేవుడే నిజమైన మన తండ్రి | Devude Nijamaina Mana Tandri

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


దేవుడే నిజమైన మన తండ్రి – దేవుడే నిజమైన మన తండ్రి
పరలోకమే… నాదేశం.. పరలోకమే… నా దేశం..
మన పౌరస్ధితి పరలోకమందే ఉన్నది
నాకెప్పుడూ జ్ఞాపకంలో ఉన్నది (2)
మాకందరికి తెలుసు మీకందరికి తెలుసా (2)
ఒక్కడే అతనొక్కడే దైవాన్ని తెలిపినది ఒక్కడే
ఒక్కడే అతనొక్కడే కాలానికే శకపురుషుడే ||దేవుడే నిజమైన||

1. భారతీయులే మాత్రమే నా సోదరులా ?
ప్రపంచంలో మనుష్యులంతా సోదరులే (2)
అందరూ మన అన్నలే అందరూ మన తమ్ములే
అందరూ మన అక్కలే అందరూ మన చెల్లిలే
అది తెలుసుకొని జీవించాలి అది తెలుసుకొని ప్రేమించాలి
నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలి
నీ శత్రువైనా ప్రేమించి నువ్వు మార్చాలి (2)
||దేవుడే నిజమైన||

2. ఆ దేవుడే మనిషికిచ్చినదీ పని (2)
ఆ పనిని చేస్తే స్వర్గమే… అది తెలిపినది ఈ బైబిలే… (2)
అది తెలుసుకొని జీవించాలి అది తెలుసుకొని ప్రేమించాలి
మనుష్యులందరికి తండ్రి ఒక్కడే ఈ మనుషులందరికి తండ్రి దేవుడే
ఒక్కడే అతనొక్కడే దైవాన్ని తెలిపినది ఒక్కడే (2)
ఒక్కడే అతనొక్కడే కాలానికే శకపురుషుడే
||దేవుడే నిజమైన||


Devude Nijamaina Mana Tandri Song Lyrics in English