Skip to content
Home » నీకొక దేవుడు నాకొక దేవుడటా | Neekoka Devudu Nakoka Devudata

నీకొక దేవుడు నాకొక దేవుడటా | Neekoka Devudu Nakoka Devudata

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


నీకొక దేవుడు నాకొక దేవుడటా? (2)
తల్లొకరే తండ్రొకరే మనుష్యులకందరికీ (2)
పిల్లలకే తండ్రులు ఉంటారా? పిల్లలకే తండ్రొకడుంటాడా?
మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుష్యులు దేవుని విడగొడతారా?
||నీకొక దేవుడు||

1. ఫలములెన్ని ఉన్నా చెట్టొకటే
మనుష్యులెందరున్నా వారికి తండ్రొకడే
భూమి మీద ప్రతివారికి తల్లి ఒక్కరే
మొదటి మనిషి ఆదాముకి ఆ దేవుడు ఒక్కడే
నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి తండ్రి ఒక్కడే
||పిల్లలకే తండ్రులు||

2. ఆదాముకి ఒక దేవుడే అతని భార్యకీ ఒక దేవుడే
మన పూర్వికులకొక దేవుడే పితరులందరికీ ఒక దేవుడే (2)
మనిషి మనిషినొక దేవుడు చేస్తాడా?
ఈ ప్రపంచానికొక దేవుడే ఉంటాడా? ||పిల్లలకే తండ్రులు||


Neekoka Devudu Nakoka Devudata Song Lyrics in English