Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
స్తుతి చేయుటె కాదు ఆరాధన
దేవుని పని చేయుటయే ఆరాధన
గమనించు దేవుని మనసులో ఆవేదన
వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన
వర్క్ ఈజ్ వర్‌షిప్ దేవునితో ఫెలోషిప్ (2)
ఆరాధన… ఆరాధన….
ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధన… ఆరాధన…
దేవుని పని చేయుటయే ఆరాధన ||స్తుతి చేయుటె||
1. పెదవులతో ఘనపరచి కూర్చుని లేస్తే సరిపోదు…
మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు (2)
ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి
అర్పణ ఆరాధనలు దేహంతో జరగాలి
మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి
ఆరాధన… ఆరాధన…
ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధన… ఆరాధన…
పాపిని రక్షించుటయే ఆరాధన ||స్తుతి చేయుటె||
2. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు
ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు (2)
ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి
బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్లాలి
దేహాన్ని దేవునిసేవకు సజీవంగా ఇవ్వాలి
ఆరాధన… ఆరాధన…
ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధన… ఆరాధన…
దేవుని పనిచేయుటయే ఆరాధన
ఆరాధన… ఆరాధన…
ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధన… ఆరాధన…
ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన ||స్తుతి చేయుటె||
Stuti Cheyute Kadu Aaradhana Song Lyrics in English