Skip to content
Home » మీలో ఎవరైనా పరలోకం వెళతారా | Meelo Evaraina Paralokam Velatara

మీలో ఎవరైనా పరలోకం వెళతారా | Meelo Evaraina Paralokam Velatara

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


మీలో ఎవరైనా పరలోకం వెళతారా
బైబిల్‌ ఎపుడైనా పరిశీలించారా
ఇరుకు ద్వారమున ప్రవేశించుటే మనిషికి కష్టం
బంధు మిత్రులను అన్నదమ్ములను విడుచుట కష్టం
సమస్తాన్ని సువార్తకై మీరిచ్చారా
చరస్ధిరాస్తులనమ్మి దేవునికిచ్చారా (2) ||మీలో ఎవరైనా||

1. శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతి కంటెను..
మీ నీతి అధికముగా ఉండవలెను (2)
విధవరాలు తన లేమిలో ఉన్నదంతా యిచ్చెను
బర్నబా తన భూమి నమ్మి దేవునికే ఇచ్చెను ||సమస్తాన్ని||

2. దశమభాగము కంటెను శ్రేష్ఠభాగము కంటెను…
మీ దేహం దేవునికే ఇవ్వవలెను
పాటలు పాడుట కంటెను మోకాళ్ల ప్రార్ధన కంటెను
పాపిని రక్షించే వాక్యం చెప్పవలెను
నీ జీతం కంటె జీవితమే ఇవ్వాలని తెలుసుకో
దేవుని కొరకే బ్రతుకునిచ్చి
పరలోకం చేరుకో ||సమస్తాన్ని||


Meelo Evaraina Paralokam Velatara Song Lyrics in English