Skip to content
Home » ప్రతి మనిషికి ఇచ్చేదీ పురస్కారమే | Prati Manishiki Ichchedi Puraskarame

ప్రతి మనిషికి ఇచ్చేదీ పురస్కారమే | Prati Manishiki Ichchedi Puraskarame

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ప్రతి మనిషికి ఇచ్చేదీ పురస్కారమే
మంచి మనిషికిచ్చేదీ పద్మవిభూషణ్‌
మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే
జాతి గౌరవించిచ్చినది భారతరత్నే
ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే….
శకపురుషుడు యుగపురుషుడు
ప్రపంచానికే యేసు ఒక్కడు (2)

1. అరిస్టాటిలున్నాడు ప్లేటో ఉన్నాడు
అలెగ్జాండర్ అశోకుడు ఎందరో ఉన్నారు
జ్ఞానులని అన్నారు రాజులని పిలిచారు
చరిత్రలో చెరిగిపోని చిరంజీవులయ్యారు
అధికారం ఎంతవున్నా అర్హులు కాలేదూ…
సర్వాధికారులైనా శకపురుషులుకాలేదూ…
క్రీస్తే శకపురుషుడు క్రీస్తే యుగపురుషుడు
ప్రపంచానికే యేసు ఒక్కడు (2) ||ప్రతి మనిషికి||

2. పరిచారం చేసాడు ప్రజల మధ్య ఉన్నాడు
పాపులకై ప్రాణం పెట్టి రక్షకుడే అయనాడు
కులమే కుళ్లని చెప్పి మతమే మత్తని చూపి
మార్గాన్ని ప్రబోధించి మహనియుడె అయనాడు
కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమని
క్రీస్తన్న మాటే గాంధీకి కదా నాందీ
మహత్ములకు మార్గం చూపి మహజ్ఞానాన్ని బోధించి
మన ఆసియా ఖండంలో బ్రతికాడు.. (2)
శకపురుషుడు యుగపురుషుడు
ప్రపంచానికే యేసు ఒక్కడు (2) ||ప్రతి మనిషికి||


Prati Manishiki Ichchedi Puraskarame Song Lyrics in English