Skip to content
Home » జోస్యం మాటే జరగని ఒక భూటకం | Josyam Mate Jaragani Oka Bhootakam

జోస్యం మాటే జరగని ఒక భూటకం | Josyam Mate Jaragani Oka Bhootakam

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


జోస్యం మాటే జరగని ఒక భూటకం
జేబులు కొట్టే పరమ నీచ నాటకం (2)
విసిరింది సవాలును బైబిలు
వినరండి జ్యోతిష్య దాసులు
విసిరింది సవాలును బైబిలు
వినరండి జ్యోతిష్య పండితులు ||జోస్యం మాటే||

1. రేపటి రూపును నీ చేతిలో చూపెడతానంటాడు
కాల చక్ర గమనాన్ని కదలి స్తానంటాడు (2)
ఏ క్షణాన్న ఏమి జరుగునో ఎవరికి ఎరుక
రేపటి భవితను చెప్పే వారికి ఇది ఒక చురక (2)
కోనసీమ తుఫానుతో తుడిచివేసె చూడు
గుజరాతు భూకంపం దేశానికి చేటు
జ్యోతిష్యపండితులారా పక్కడున్నారు ?
ప్రళయాన్ని ముందెందుకు చెప్పకున్నారు ?
జోస్యం ఆలోచనయే మానవ అజ్ఞానం
దేవుడు పట్టించు నిన్ను తిరుగుముఖం
విసిరింది సవాలును బైబిలు వినరండి జ్యోతిష్య దాసులు
విసిరింది సవాలును బైబిలు వినరండి జ్యోతిష్య పండితులు ||జోస్యం మాటే||

2. గ్రహచారం అంటావు అపచారం అంటావు
గ్రహాలన్ని నీ చేతితో నీవు త్రిప్పుచున్నావా ?
ఆ దేవుని చేతి పనినే తప్పుపట్టువాడవా ?
గ్రహాలన్ని నీ మేలుకే తిరుగుతున్నాయనుకోవా ?
ఒకరోజు మంచిదని ఒకరోజు చెడ్డదని
శాంతమైన బుర్రకు చింతలెన్నో పెడతావు
కాలాన్ని నడిపేది దేవుడని తెలుసుకో
జరుగబోవు ప్రమాదాన్ని ఆపలేవు చూసుకో
వాస్తు విడిచి క్రీస్తు కొరకు ఈనాడే తెలుసుకో
నీ గుండె ఎపుడు ఆగునో నీకు తెలియదు
ఎదుటివాన్ని సింహరాశి అంటాడు
మరునాడే ప్రమాదంలో కుక్కలా చస్తాడు
ఆ చుక్కల గుంపుకు పెట్టిన రాశులన్ని వట్టి ఊహలే ||జోస్యం మాటే||


Josyam Mate Jaragani Oka Bhootakam Song Lyrics in English