Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం
ఇది మొదటి శతాబ్ధపు విప్లవం (2)
మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం
మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం
విప్లవం వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి
క్రైస్తవులంతా పోరాటం చేయాలి (2) ||ఇది ప్రారంభ||
1. క్రైస్తవ్యం కులమే కాదు
క్రైస్తవ్యం మతమే కాదు
క్రీస్తు బోధ మతమార్పిడి కానే కాదు (2)
నేడైనా రేపైనా ఎక్కడైనా
బైబిల్ తప్పంటే ఓడిస్తాం (2)
జ్ఞానులనైనా ఒప్పిస్తాం
మూర్ఖుల నోరు మూయిస్తాం
భూలోకం తలక్రిందులు చేసేస్తాం (2) ||ఇది ప్రారంభ||
2. దొంగ బోధకుల పని పడతాం
తప్పుడు బోధల నరికడతాం
సత్య వాక్యాన్ని సరిగా విభజిస్తాం (2)
శ్రమయైనా, కరువైనా, లేమైనా
క్రీస్తే రక్షకుడని బోధిస్తాం (2)
శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం
సామంతులనైనా శాసిస్తాం
దేవుడు ఉన్నాడని సవాల్ చేస్తాం (2) ||ఇది ప్రారంభ||
Idi Prarambha Kraistava Prabhanjanam Song Lyrics in English