Skip to content
Home » లోకాలనేలె మహ సామ్రాజ్యమా | Lokalanele Maha Samrajyama

లోకాలనేలె మహ సామ్రాజ్యమా | Lokalanele Maha Samrajyama

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


లోకాలనేలె మహ సామ్రాజ్యమా
బబులోను సామ్రాజ్యమా
మాదీయ సామ్రాజ్యమా
గ్రీకు రోమా సామ్రాజ్యమా (2)
వాటిణనిచేసింది చిన్నరాయి
అదే మూలకు తలరాయి
ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యమే
క్రీస్తు సామ్రాజ్యమే అది క్రీస్తు సామ్రాజ్యమే
ఆరాజ్యనికి రారాజు క్రీస్తే క్రీస్తే
ప్రపంచంలో అత్యధికం క్రైస్తవులే ||లోకాలనేలె||

1. అంతం లేనే లేదు క్రీస్తేసు సామ్రాజ్యం
ఆపాలనుకుంటే ఆహుతైపోవుట ఖాయం (2)
విస్తరిస్తువుంది ఈనాటికి
మనిషి మనుగడున్న ప్రతిచోటికి (2)
కత్తి పట్టకుండ కర్ర పట్టకుండ
ప్రేమ ఆయుధాన్ని పట్టి బయలుదేరాడు
మాటలతో మనసు మార్చి చేతలతో చేసి చూసి
ప్రాణమిచ్చి ప్రతిమనిషిని కొన్నాడు
మనిషికి మరణం తధ్యం
ఆత్మకు రక్షణ ముఖ్యం
స్వర్గం చేరాలంటే క్రీస్తే మార్గం ||లోకాలనేలె||

2. క్రీస్తు విప్లవవాదే కాని ఉగ్రవాది కాడు
ప్రాణం పెడతాడు గాని ప్రాణాలను తీయడు (2)
మనసులోనే పుడుతుంది నేరం
దానిని ఆపకుంటే జరుగుతుంది ఘోరం
కత్తిపట్టకుండ తుపాకి పేల్చకుండా
మనసు మార్చే మాట మదిలో పేల్చాడు
మాటలతో మనసు మార్చి
చేతలతో చేసి చూపి
ప్రాణమిచ్చి ప్రతి మనిషిని కొన్నాడు
ప్రతి మనిషిని ప్రేమించి
తన ప్రేమను చూపించి
తనలాగే బ్రతకాలని నేర్పించాడు ||లోకాలనేలె||


Lokalanele Maha Samrajyama Song Lyrics in English