Skip to content
Home » మనిషి జన్మ ప్రారంభం | Manishi Janma Prarambham

మనిషి జన్మ ప్రారంభం | Manishi Janma Prarambham

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం (2)
స్త్రీ పురుషుల కలయిక వలన ప్రారంభం
తండ్రి నుండి ఆత్మ ప్రవేశం
తల్లిలోనే నిర్మాణం
దేవుని వలనే పుట్టిన వారమే మనం
దేవుని కొరకే పుట్టిన వారమే మనం ||మనిషి జన్మ||

1. ఎక్కడ పుట్టావో
తెలుసుకోవడం కాదు ముఖ్యం
ఎందుకు పుట్టావో
తెలుసుకోవడం ప్రాముఖ్యం (2)
అమ్మా నాన్న ఆవేశంతో
కలుగలేదు నీ జననం (2)
ఆశపడ్డ ప్రతి దంపతులకు
కలుగటలేదీ తరుణం (2)
అంతు చిక్కనీ అపూర్వ నిర్మాణం
అన్నిటికంటే మిన్నది నీ ఆకారం (2)
సర్వసృష్టిలో శ్రేష్టుడవు
సృష్టికర్త స్వరూపుడవు ||మనిషి జన్మ||

2. సృష్టెప్పుడు పుట్టిందో
తెలుసుకోవడం కాదు ముఖ్యం
సృష్టికర్త ఎవరో
తెలుసుకోవడం ప్రాముఖ్యం (2)
అమ్మానాన్న అడగకముందే
దేవుడు సృష్టిని చేసాడు (2)
అవయవాల కోరిక నెరిగి
ఆహారం కలిగించాడు (2)
సృష్టికర్తనే మరచుట అన్యాయం
సృష్టమునే పూజించుట మరి అన్యాయం (2)
సర్వసృష్టిలో శ్రేష్టుడవు
సృష్టికర్త స్వరూపుడవు ||మనిషి జన్మ||


Manishi Janma Prarambham Song Lyrics in English