Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
దయ్యమా? దైవమా?
తెలుసుకో నేస్తమా (2)
దేహంలో దయ్యం కూర్చుంది
దేవుని చోటే మార్చింది
మనిషిని మాయచేసి భక్తుని వేషం వేసి (2)
మతం మత్తులో ముంచింది
మారణహోమం చేస్తుంది
దయ్యమా?…. దైవమా?…. (2) ||దయ్యమా?||
1. శ్మశానాలలో దయ్యముందని
ఎండిన చెట్టు ఎక్కి ఉందని
ఎర్రని నిప్పులు కక్కుతుందని
తెల్ల చీరతో తిరుగుతుందని (2)
భ్రమపరిచింది…. భయపెడుతుంది…..
శ్మశానాలలో ఉంది భయం
ప్రజల మధ్యనే ఉంది దయ్యం
దయ్యమా?…. దైవమా?…. (2) ||దయ్యమా?||
2. దేవాలయాలలో పూజలు
మసీదులలో నమాజులు
చర్చ్‌లలో ప్రార్థనలు
ఎక్కడ చూచినా భక్తులు (2)
భక్తుల సంఖ్య పెరుగుతుంది
నేరాల సంఖ్య తగ్గకుంది
ప్రజలలో ఉంది భక్తా ?
ప్రబలుతుంది దెయ్యం శక్తా ?
నీలో ఉన్నది దైవమా ? నీతో ఉన్నది దయ్యమా ?
దయ్యమా?…. దైవమా?…. (2) ||దయ్యమా?||
Dayyama Daivama Song Lyrics in English