Skip to content
Home » ఎవరెవరి కొరకు | Evarevarikoraku

ఎవరెవరి కొరకు | Evarevarikoraku

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ఎవరెవరి కొరకు ఆలోచించుచున్నారు?
భార్యలకై భర్తలా ?
పిల్లలకై తండ్రులా ?
ప్రజల కొరకు మంత్రులా?
మృతులకై సజీవులా?
ఎవరాత్మ కొరకు వారు ఆలోచించక
చనిపోయిన వారికై సంతాపసభలా?
జ్ఞాపకార్థ కూడికలా? ||ఎవరెవరి కొరకు||

1. నా యిష్టం నా కష్టం అంటున్నావు
నీ దేవుని యిష్టాన్ని పరుగకున్నావు
కష్టించి పనిచేసిన దేవునినే మరచి
క్షణికమైన సుఖముకై బ్రతుకుచుంటివా
నీ కొరకై బలియైన క్రీస్తునే మరిచి
మృతులైన వారికై యోచిస్తావా ? ||ఎవరెవరి కొరకు||

2. బంధుత్వపు బంధంలో బందీవైనావా
అంధత్వపు అంధునిగా బ్రతుకుచున్నావా
నీకిచ్చిన కాలమే ముగియునని తెలిసి
సంపాదన సందడిలో తేలుచున్నావా ?
నీ ఆత్మ కట్టె వీడక ముందే
నరకానికి జారకముందే
ఇదే అనుకూల సమయము
స్వీకరించు నేడే యేసుని ||ఎవరెవరి కొరకు||


Evarevarikoraku Song Lyrics in English