Skip to content
Home » Archives for SUTOTAL » Page 137

SUTOTAL

దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు "sutotally" అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక! Preaching the Word of God to the Souls and Constructing a better Society. We do War with Evil and save the Innocent. We continue building the Kingdom of God and prepare for Jesus’ Second Coming by beholding the Truth.

అసలైన భక్తి ఏది నిజమైన భక్తులు ఎవరు?

అసలైన భక్తి ఏది? నిజమైన భక్తులు ఎవరు? పాపభీతి మనిషిలో ఉండుట వలన ఏమి చేయాలనుకుంటున్నాడు? ఈ లోకములో నీతిమంతులెవరు? ఒక్కరైనా ఉన్నారా? అసలైన భక్తికి ఏడు సూత్రాలు ఏమిటి? నిజమైన భక్తునిలో ఉండవలసిన అర్హత ఏమిటి? దేవుడు భక్తుని నుండి కోరుకుంటున్నది ధనమా? జీవితమా?

వాక్యోపదేశకుని వస్త్రధారణ

వాక్యోపదేశకుని వస్త్రధారణ. దేవుని సేవ చేయువారు ఎలాంటి వస్త్రములను ధరించాలి? ఏఫోదు అనగా ఏమిటి? గిద్యోను ఏఫోదు మనకు నేర్పుచున్న పాఠమేమిటి? దేవుని సేవార్ధమై దిగంబరత్వము అనగా ఏమిటి? దేవుని యింట అనేక నివాసములున్నాయగా అర్ధమేమిటి?

ఓడిపోయి చచ్చేవారు – చచ్చినా ఓడనివారు!

ఓడిపోయి చచ్చేవారు – చచ్చినా ఓడనివారు! లోకసంబంధమైన ఓటమి – దైవసంబంధమైన ఓటమి మధ్య వ్యత్యాసము ఏమిటి? ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఏ విషయమందు ఓడిపోయారు? కయీనులో మరణ భయానికి కారణమేమిటి?మరణమునకైనా సిద్ధమేగానీ, ఓటమికి కాదు అన్న విధముగా దేవుని కొరకు జీవించినవారెవరు? ఆత్మ విషయమైన పిరికితనము దేనికి దారి తీస్తుంది?suto

బాలశిక్షకుని బాటలో బలహీనులు

బాలశిక్షకుని బాటలో బలహీనులు. ఏ కాలానికి వెళ్లినా దేవుడు మార్పు లేనివాడు! అబ్రాహాముతో దేవుడు నిత్యనిబంధన చేసాడు? నేడు అది మనకు వర్తిస్తుందా? ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధనలో నేడు మనము కూడా పాలివారమా? నోవహు జలప్రళయము తరువాత దేవుడు చేసిన నిబంధన నేటికీ మన జీవితాలలో నెరవేరుచున్నదా? ఒకసారి నిబంధన చేసిన దేవుడు, మరల క్రొత్త నిబంధనను ఎందుకు చేసెను?

మళ్లీ మళ్లీ రాని జీవితం!

మళ్లీ మళ్లీ రాని జీవితం! దేవుడు ప్రతి మనిషికి ఎన్ని జీవితాలను ఇచ్చాడు? మనిషి మరణించాక దేహం ఎక్కడికి? ఆత్మ ఎక్కడికి? మనిషి మరణించిన తరువాత ఆత్మకు ఎదురయ్యే పరిస్థితి ఏమిటి?మనిషి జీవితములో అవకాశాలు అనేకం – కానీ జీవితం ఒక్కటే! చనిపోయిన వారిని గూర్చి ఏడ్వక, పోవుచున్న వారికొరకు ఏడ్చుట అనగా?

జ్ఞాపకాలను అందిస్తున్న జ్ఞానగ్రంథం

జ్ఞాపకాలను అందిస్తున్న జ్ఞానగ్రంథం. పరిశుద్ధ గ్రంథము ఏ విధమైన జ్ఞాపకాలను కలిగి ఉన్నది? దేవుడు వ్రాయించిన జ్ఞాపకాలను తెలిసికొనుట వలన కలిగే ఉపయోగము ఏమిటి? పరిశుద్ధ గ్రంథమును నిషేధించుట ఎవరి తరము? హృదయమను పలక మీద దేవుని జ్ఞాపకాలను ఎలా వ్రాసుకోవాలి? అక్షరము చంపును; ఆత్మ జీవింపజేయును – అనగా ఏమిటి?