Yesukreestu Prabhuuv Yokka Maranashaasanamu • యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణశాసనము • The covenant of the death of the Lord Jesus Christ

యేసు ప్రభువు మరణశాసనమును వ్రాసింది ఎవరు?
మరణశాసనము ఎవరిని గూర్చి వ్రాయబడింది?
యేసు ప్రభువు మరణశాసనము చెల్లుబాటు అయినదా?
మన విషయములో మరణశాసనము పాత్ర?
క్రీస్తు ప్రభువు మార్గము లోనికి ఎవరైనా బలవంతముగా రావచ్చా?

Audio Message of The covenant of the death of the Lord Jesus Christ • Yesukreestu Prabhuuv Yokka Maranashaasanamu • యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణశాసనము ఆడియో సందేశము

మా పరిచర్యను గూర్చి..

సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!

About Our Ministry..

Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons in their entirety on our YouTube channel, CHRIST CHURCH ASIA. Listen to these messages till the end. If possible, while listening to our sermons, we request you to keep the Holy Bible in your hand to examine what we have presented to you. If you find these videos helpful in your spiritual growth, introduce them to as many people as you can. Every day we publish the latest and necessary content on this website as well as on our YouTube channel. We hope you will regularly learn God’s wisdom through these videos and gain spiritual benefits from this ministry. We hope you get an answer in the name of our Lord and Savior Jesus Christ!

ఉచిత వైద్యశిబిరం – ఆత్మారోగ్యమే మహాభాగ్యం

ప్రియ పాఠకులారా!, ఈ సమాజంలో అత్యంత ఖరీదైనది, ప్రతి మనిషీ కోరుకునేదే, ఆరోగ్యం! పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తల్లిదండ్రులు, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రజాప్రతినిధులు ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) వారు కోరుకుంటున్నారు. ప్రపంచమంతా ముక్తకంఠముతో అందరి ఆరోగ్యాన్ని కోరుకుంటూ, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని నినదించినా, ఇప్పటికీ అందరూ రోగాలతోనే ఉన్నారు, ఎప్పటికీ రోగాలతోనే ఉంటారు. ఒక ప్రక్క  వైద్యశాస్త్రం పురోగాభివృద్ధి చెందుతున్నా మరో ప్రక్క ఆసుపత్రులలో వార్డులన్నీ రోగులతో కిటకిటలాడి పోతున్నాయి. రోడ్ల మీద ‘108 వాహనాలు’ అలుపెరుగక పరుగెడుతున్నాయి. అసుపత్రి మార్చురీలు నిండిపోతున్నాయి. ఈ జఠిలమైన చిక్కు ప్రశ్నకు దేవుడే పరిష్కారమును చెప్పగలడు. సర్వజగద్రక్షకుడైన దేవుడు కూడా మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే ఆయన ఏమని పలికాడో చూడండి.

సామెతలు గ్రంథము 3 : 7, 8  నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు గలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ యెముకలకు సత్తువయు కలుగును.

దీనిని బట్టి, మనిషి ఆరోగ్యవంతుడుగా దేవుడిచ్చిన జీవిత కాలమంతా రోగము లేకుండా బ్రతకాలంటే ‘చెడుతనమును’ విడిచిపెట్టాలి. దేవుడు చెప్పిన ఈ మాటలు అక్షరసత్యం! అసలు ఈ భూమి మీద మొట్టమొదటి రోగము మనిషి చెడుతనముతోనే ప్రారంభమైంది. ప్రారంభపు మనుష్యులైన ఆదాము, హవ్వలు దైవాజ్ఞాతిక్రమము (పాపము) చేసిన దానిని బట్టి, రోగము మనిషికి సంక్రమించింది. మనుష్యులు నివసిస్తున్న ప్రకృతి పాడయింది. అందుకే దేవుడు మనిషి రోగానికి సరియైన వైద్యమును చేస్తున్నాడు. దేవుని వాక్యము ఒక ఔషధముగా పనిచేస్తుంది. అదెలాగంటే, ప్రతీ మనిషి నీతిమంతుడుగా మారిపోవాలి! ఈ లోకపు వైద్యులు ఏనాడూ ఈ విషయమును ఏ రోగికీ చెప్పలేదు, చెప్పరు! ఎందుకంటే వారికి లోకజ్ఞానము తప్ప, దైవజ్ఞానము తెలియదు. రోగాన్ని నయం చేసిన తరువాత ఇంటికి (డిస్చార్జ్‌) పంపించే ముందు, వెళ్లి ఇక పాపమును చేయవద్దని ఏ వైద్యుడైనా ఏ రోగికైనా ఎన్నడైనా చెప్పాడా? ఈ విశ్వంలో ఇలా చెప్పిన ఒకే ఒక పరమ వైద్యుని మీకు పరిచయం చేస్తాను.  ఆయనే యేసుక్రీస్తు!

యోహాను సువార్త 5 : 14 యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్ధత నొందితివి. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు పాపము చేయకుమని చెప్పెను.

సమాజములోని మనుష్యులు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి అన్నారు, ఉదయాన్నే నడవాలి అన్నారు, మంచి ఆహారమును తీసుకోవాలి అన్నారు. ఇవన్నీ మంచివే అయినా, మనిషి తన చెడుతనమును విడిచిపెట్టనంత వరకు ఎన్ని చేసినా ఈ విషయములో కలిగే ప్రయోజనం శూన్యం!

అసలు చెడుతనమును విడిచిపెట్టడమంటే ఏమిటి? మనిషి నీతిమంతుడుగా మనిషి ఎలా మారగలడు? ఈ విషయమును మరల దేవునినే అడుగుదాం.

సామెతలు గ్రంథము 4 : 20 – 22  దేవుడు – నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుట నుండి వాటిని తొలగి పోనియ్యకుము. నీ హృదయమునందు వాటిని భద్రము చేసికొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.

దేవుని మాటలు జీవము కలిగినవి, సభ్యసమాజంలో  నివసిస్తున్న ప్రతి మనిషి సర్వోన్నతుని మాటలవైపు తిరగాలి. మనిషి వెళ్లాల్సింది ఒక మతము లోనికి కాదు, పరిశీలనతో కూడిన దేవుని జ్ఞానపు వెలుగు లోనికి. దేవదేవుడు మనిషిని గూర్చి ఎంతగా ఆలోచించాడంటే, తన జ్ఞానమును నేర్చుకున్న మనిషి ఆరోగ్యవంతుడుగా, అంతమాత్రమే గాక, తన ఆత్మను కూడా రక్షించుకునేవాడుగా మారాలని కోరుకున్నాడు. మనిషి యొక్క శరీరము మాత్రమే ఆరోగ్యంగా ఉండి, తన ఆత్మ చెడిపోయి, తాను మరణించిన తరువాత నిత్యత్వాన్ని కోల్పోతే తనకు ఏమి ప్రయోజనం?

పుట్టుకతోనే రోగాలు కలిగిన మనిషి నేరుగా టీకాలు వేయించుకుంటున్నాడు. పోలియో చుక్కలు మ్రింగుతున్నాడు. తన శరీరాన్ని ఆరోగ్యకరమైనదిగా ఉంచుకోవడానికి ఎన్నో పాట్లు పడుతున్నాడు, ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు. కానీ నిత్యమూ ఉండే ఆత్మ అనే శక్తిని గూర్చి ఎన్నడైనా ఆలోచించాడా? దేవుని మాటలలో ఈ విషయమైన ఆంతర్యాన్ని గ్రహిస్తే, ప్రతి మనిషి తక్షణమే ఆలోచించవలసినది – తన ఆత్మారోగ్యాన్ని గూర్చి అని మనకు స్పష్టముగా అర్థమవుతుంది!

లోకజ్ఞానానుసారమైతే : శరీర ఆరోగ్యమే మహాభాగ్యం : 60 లేదా 70 యేళ్ల రోగపు బ్రతుకు
దైవజ్ఞానానుసారమైతే : ఆత్మారోగ్యమే మహాభాగ్యం : నిత్య కాలపు సంతోషపు బ్రతుకు

ఈ రోజు మనిషి దేనిని కోరుకుంటున్నాడు? లోకజ్ఞానులు ఏమి నేర్పిస్తున్నారు? అందుకే దేవుని పిలుపులో ఉన్న సద్భావాన్ని గ్రహించండి. మీ ఆత్మలను రక్షించే శక్తి గల దేవుని వాక్యాన్ని నేర్చుకుని, దానిని పాటించండి.

ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీరంతా గుర్తుంచుకోవలసినదిగా మనవి. దేవుని వాక్యమును మీరు స్వీకరించేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం. మందుల షాపులో ఉన్న మందులన్నీ మంచివే. అవన్నీ శరీర రోగాలను కుదిర్చేవే. కానీ ఏ మందు ఎంత మోతాదులో, ఎలా వాడాలో తెలియకపోతే, ఆ ఔషధమే మీ ప్రాణమును హరించి వేస్తుంది అనుటలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే, దేవుని వాక్యమును అనేకమంది తెలియక, నేర్చుకోక, తమ స్వార్థ ప్రయోజనాల కొరకు, అబద్ధముగా ప్రజల లోనికి తీసుకొని వెళుతున్నారు. ఇలాంటి వారి విషయములో జాగ్రత్తపడి, దేవుని వాక్యమును సరియైన పద్ధతిలో, దేవుని సంకల్పానుసారముగా స్వీకరించాలన్నదే దేవుని ఆశ.

2తిమోతికి పత్రిక 1 : 13,14 పౌలు – క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నా వలన వినిన హిత వాక్య ప్రమాణమును (ఆరోగ్యము గల వాక్య ప్రమాణమును) గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్ధమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము.

ఆరోగ్యకరమైనదిగా వాక్యమును స్వీకరించాలనే ఆజ్ఞ ఎందుకివ్వబడినదో ఇప్పటికైనా తెలుసుకోండి. 70 యేళ్ల బ్రదుకులో శరీరానికి పట్టిన రోగం పోతే చాలు అనుకునే దౌర్భాగ్యులారా, మోసపోతున్నారు జాగ్రత్త! మీ మేలును కోరి దేవుడు పలికించిన ఆరోగ్యకరమైన మాటలివి. ఆయన మాటలను, హితమైన వాక్యముగా మీరు  గైకొనునప్పుడు మీ ఆత్మను రక్షించుకొనుట మాత్రమే గాక, మీ శరీరము కూడా సత్తువ కలిగినదిగా మారుతుంది.

ఇక చివరిగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి దేవుడెలాంటి మాటలు ప్రయోగించాడో తెలుసా?

మత్తయి సువార్త 18: 8, 9 యేసు – నీ చెయ్యియైనను, నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చేతులును  రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే, కుంటివాడవుగనో, అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు.

నీవు ప్రస్తుతం ఒక రోగగ్రస్థుడవైనా ముందు నీ రోగాన్ని కుదుర్చుకోవడానికి కాకుండా, ఆత్మను కాపాడుకునే ప్రయత్నాన్ని చేయాలి! ఎందుకంటే, పరలోకము వెళ్లడానికి తద్వారా నిత్య జీవములో ప్రవేశించడానికి ఆత్మారోగ్యమే ప్రధానం తప్ప శరీరారోగ్యం కాదు! పైగా ఇది పూర్తిగా ఉచితం!

దేవుని వాక్యమును ఆరోగ్యకరమైనదిగా నీవు నేర్చుకోవాలంటే, పైసా కూడా చెల్లించనక్కరలేదు. ఆత్మను రక్షించే వాక్యమును దేవుడు ఉచితముగా ఇచ్చి, తిరిగి అనేకమందికి ఉచితముగా పంచమన్నాడు. అందుకే, నేటి సమాజంలో అందరి దొంగలవలె కాకుండా, ఆత్మలను (అనగా మనుష్యులను) రక్షించుటకు దేవుడు ఉచితముగా ఇచ్చిన ఈ ఖరీదైన ఆత్మజ్ఞానమును కల్తీ లేనిదిగా, ఆరోగ్యకరమైనదిగా నేర్పించుటకు స్వార్థం లేని కార్యక్రమాన్ని సంకల్పించాము.

క్రైస్ట్‌ చర్చ్‌  ఆసియాగా ఏర్పడి, నిరంతరం బైబిల్‌ను పరిశోధిస్తూ సమాజానికి అవసరమైన హిత వాక్యమును ఉచితముగా అందజేస్తూ అనుదిన సత్య వాక్యబోధను ప్రారంభించాము. ఆసక్తితో రండి! ఆలోచనాత్మకంగా వినండి!  ఆత్మారోగ్యాన్ని పొందండి! ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే గొప్ప వైద్యులుగా మారండి.

మరిన్ని వివరములకు: యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మకస్థుడు, దైవజనులు మణికుమార్‌ క్రైస్ట్‌ చర్చ్‌, ఆసియ.

Yesukreestu Prabhuuv Yokka Maranashaasanamu యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణశాసనము The covenant of the death of the Lord Jesus Christ Sutotal

Program Name: Spiritual Sermons (ఆత్మీయారాధన)

Topic: Yesukreestu Prabhuuv Yokka Maranashaasanamu • యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణశాసనము • The covenant of the death of the Lord Jesus Christ

Date: 27/04/2025


Discover more from SUTotal

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top

Discover more from SUTotal

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading