మా పరిచర్యను గూర్చి..
సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!
About Our Ministry
Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons in their entirety on our YouTube channel, CHRIST CHURCH ASIA. Listen to these messages till the end. If possible, while listening to our sermons, we request you to keep the Holy Bible in your hand to examine what we have presented to you. If you find these videos helpful in your spiritual growth, introduce them to as many people as you can. Every day we publish the latest and necessary content on this website as well as on our YouTube channel. We hope you will regularly learn God’s wisdom through these videos and gain spiritual benefits from this ministry. We hope you get an answer in the name of our Lord and Savior Jesus Christ!
ప్రియమైన సహోదరీ సహోదరులారా!
మొదటి శతాబ్ధంలో ప్రారంభమైన క్రీస్తు విప్లవం, నేటికి సుమారు 350 కోట్లమంది క్రైస్తవులుగా ప్రపంచ నలుదిశలా వ్యాప్తిచెందుచున్నది. దీనికి కారణం, పెరుగుతున్న నేటి నామకార్థ క్రైస్తవుల గొప్పతనమో, అబద్ధ బోధకుల ఆరాటమో లేక ప్రభుత్వాల సహాయమో కాదు గాని సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు బోధనలలోని శక్తి! ఇప్పటికీ ఎందరో క్రైస్తవ్యాన్ని అణచాలని ప్రయత్నిస్తున్నా, ఇది శరవేగముతో దూసుకుపోవలసిందేగాని అడ్డుపడినవారు తునాతునకలవ్వక తప్పదని బైబిల్‌ని బట్టి చెప్పవచ్చు. అయితే, నేటి క్రైస్తవ్యం 3000కు పైగా మతశాఖలుగా చీలిపోయి, ఎవరి బోధ వారిదే అన్నతీరులో ఉండుటను చూస్తే, వ్యాప్తిచెందుతున్న నామకార్థ క్రైస్తవ్యాన్ని చూచి ఆనందించాలో లేక విస్తరిస్తున్న క్రైస్తవుల వలన దేవునికి ఏ మాత్రం సంతోషము లేదని విచారించాలో అనేది గోచరము కాదు. క్రీస్తు పరలోకమునకు వెళ్లిన తరువాత అనుగ్రహింపబడిన పరిపూర్ణమైన దైవవాక్యము ఎవ్వరికీ పూర్తిగా అర్థం కాలేదనుటలో ఏ మాత్రం సందేహం లేదు!
వాక్యానికి వాక్యమే సమాధానము
నేడున్న క్రైస్తవ్యాన్ని సరిచేస్తూ, సందేహపడువారిమీద కనికరము చూపుతూ, ‘వాక్యానికి వాక్యమే సమాధానము’ అన్న నినాదంతో ప్రతి ఒక్కరిచేత బైబిల్‌ను పరిశోధింపచేయాలన్న సంకల్పంతో ప్రారంభింపబడినదే స్క్రిప్చర్స్ యూనివర్శిటి. స్త్రీ, పురుష, వయోభేధం మరియు కుల, మత, వర్గ వివక్షలు లేకుండా ఆందరికీ ఈ మహాజ్ఞానాన్ని ఉచితంగా నేర్పించుటకు ఆశపడుచున్నాము.
మేము నేర్పించుచున్న ఈ మహాజ్ఞానము మరెక్కడా నేర్పించారన్న విషయమును, మా పాఠాలు విన్న తరువాత మీరే సాక్ష్యం చెబుతారు. దేవుడెంతమందికి అర్థమయ్యాడు? 70, 80 యేళ్ల బ్రతుకులో రోగాలు పోగొట్టే RMP డాక్టర్‌గా కొందరికి, చనిపోతే ఏమీ తీసుకెళ్ళలేని విస్తారమైన ఆశీర్వాదాలు, సంపదలు ఇచ్చేవాడిగా మరికొందరికి, ఆపదమొక్కులవాడిగా కొందరికి, అవసరాలకు గుర్తొచ్చేవాడిగా మరికొందరికి! ఇదా దేవుని గూర్చి తెలుసుకోవలసిన తీరు? ఇవేనా దేవునికుండవలసిన లక్షణాలు? దేవుడంటే ఎవరో తెలియనివారలారా, బహుపరాక్! మీ బ్రదుకు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియదు. బ్రదుకు ముగిసాక అర్ధం చేసుకోవడానికి అవకాశమే లేదు. భూమిమీద బ్రతికుండగానే దేవునిని గూర్చి క్షుణ్ణముగా తెలుసుకోండి. సకలశాస్త్రాలనూ అధిగమించిన బైబిల్‌లోని 66 పుస్తకాలలో నిక్షిప్తమైయున్న దేవుని మహా జ్ఞానమును గ్రహించండి!
ప్రపంచ క్రైస్తవ్యానికి తెలియని, మేము నేర్పించే కొన్ని అంశములు:
- విజ్ఞులెరుగని వింత !
- నీ జన్మకు ముందున్న చరిత్ర ఏమిటి?
- మనిషికి తెలియని మరణ రహస్యం?
- నాకు తెలిసిన దేవుడు నీకు తెలుసా?
- కోటిలో ఒకడివా? కోటికి ఒక్కడివా?
- దేవునిది కోపమా? దీర్ఘశాంతమా?
- క్రైస్తవ్యం మతమా? మహాజ్ఞానమా?
- దేవుని మాట మనిషిని ఎలా బ్రతికిస్తుంది?
- మూడు దినములలో మందిర నిర్మాణం
- స్వస్థతలు జరిగించే వరం నేటి బోధకులకు ఉందా?
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! ఇంకా ఎన్నో అంశములు ప్రతిరోజూ పాఠముల రూపంలో నేర్చుకోవాలన్న ఆలోచన మీకుంటే, పండితుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో నిరూపణలతో కూడిన దేవుని వాక్యమును నేర్పించుటకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇందులో మాకు ఎటువంటి స్వార్థమూ లేదు; స్వలాభాపేక్ష అంతకన్నా లేదు. తెల్లదొరల సహాయం ఇసుమంతైనా ఇక్కడ కనిపించదు. మా చేతుల కష్టముతో, మన దేవునికి ఈ తరములో కొద్దిగానైనా సేవచేయాలనే ఆలోచన మాత్రమే కలిగినవారము.
మరిన్ని వివరములకు:
బైబిల్‌లో మీకున్న విప్లవాత్మక ప్రశ్నలకు, సంచలనాత్మక సమాధానములు కావాలన్నా మరియు ఎవరైనా ఏవిధముగానైనా క్రీస్తునుగాని, బైబిల్‌నుగాని తప్పుపడితే బహిరంగముగా సత్యమునుబట్టి దేవుని వాక్యమునకున్న పరిశుద్ధతను నిరూపించి, వాదించి, ఒప్పించుటకు మమ్మును తప్పక సంద్రించగలరు. వివరములకు: దైవజనులు మణికుమార్ గారు, స్క్రిప్చర్స్ యూనివర్శిటి. మొబైల్ : 8978414178 www.sutotal.com
Dear brothers and sisters!
The revolution of Christ which started in the first century, today there are about 350 crore Christians and it is spreading in the four directions of the world. The reason for this is not the greatness of today’s growing number of nominal Christians, the greed of false teachers or the help of governments, but the power of the teachings of Jesus Christ about two thousand years ago! Although many are still trying to suppress Christianity, the Bible tells us that it must be rushed forward and those who are hindered will not perish.
However, if today’s Christianity is divided into more than 3000 religious sects and whose teachings are different, it is not clear whether to rejoice at the spread of nominal Christianity or to inquire that God is not pleased by the spread of Christians. There can be no doubt that no one fully understands the perfect Word of God that was bestowed after Christ’s ascension!
Necessity of Scriptures University
The Scriptures University was started with the desire to correct Christianity today, to have mercy on doubters, and to make the Bible search by everyone with the slogan ‘word to word is the answer’. We hope to teach this Mahajnana free of charge to all without discrimination of gender, age, caste, religion or caste.
After listening to our lessons, you will testify that this great wisdom that we are teaching has been taught elsewhere. How many people understand God? For some as a RMP doctor who cures diseases in the life of 70, 80 years, for others as a giver of vast blessings and riches who can take nothing away if they die, for some as a harbinger of danger, for others as a person who recognizes the needs! Is this the way to know God? Are these the characteristics that God should have? Those who do not know who God is, Bahuparak! You never know when your life will end. At the end of life there is no chance of understanding. Know God thoroughly while living on earth. Realize the great wisdom of God contained in the 66 books of the Bible that surpasses all science!
Some of the things we teach that are unknown to worldly Christianity:
- A strange thing that the wise do not know!
- What is your birth history?
- The secret of death unknown to man?
- Do you know the God I know?
- One in a million? or One for a million?
- Is God angry? or Long-suffering?
- Is Christianity a religion? or a Great Wisdom?
- How does God’s word make man alive?
- Temple construction in three days
- Do today’s preachers have the gift of healing?
Needful Action by Every Christian:
These are just a few of the spots! If you want to learn many more topics in the form of daily lessons, we are ready to teach the Word of God with proofs in a way that everyone can understand, from scholars to laymen. We have no vested interest in this; No more selfishness. Even the help of the whites is not seen here. With the labor of our hands, we have only the thought of serving our God a little in this generation.
For More Details:
If you want revolutionary answers in the Bible, sensational answers, and anyone who is in any way wrong with Christ or the Bible, you must come to us to openly prove, argue and convince the purity of God’s Word according to the truth. For details: Man of God- Manikumar, Scriptures University. Mobile : 8978414178 www.sutotal.com
Program Name: Power of God Sermons (దైవశక్తి)
Topic: The Power of God’s Word | దేవుని వాక్యములోని శక్తి
Date: 01/11/2024
You must be logged in to post a comment.