ఏ తల్లిదండ్రులైనా | Ye Tallidandrulaina

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పారా ?
ఏ దైవ భక్తుడైనా తమ పిల్లలను వాక్యంలో పెంచారా ?
యేసుక్రీస్తుగా పెంచాలని అపొస్తలులుగా పెరగాలని
దేవుని కోసం పెంచాలని ఈ మనసే లేదా
మీ పిల్లలతో కలిసి నరకానికి వెలిపోతారా? ||ఏ తల్లిదండ్రులైనా||

1. కోడే తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుంది (2)
తన బ్రతుకే నీ కోసమని మరణించే తెలుపుతుంది
దేవుని కోసం పెంచాలనే ఈ మనసే మీకే లేదా
బ్రతుకిచ్చిన దేవుని మరచి మీ కోసమే బ్రతుకుతారా?
మీ పిల్లలతో కలిసి నరకానికి వెలిపోతారా? ||ఏ తల్లిదండ్రులైనా||

2. హన్నా సమూయేలునే దేవునికే ఇవ్వలేదా? (2)
ఆ దేవుడే బలి కోరితే అబ్రహమే ఇవ్వలేదా?
దేవుని కోసం ఇవ్వాలనే ఈ మనసే మీకే లేదా?
కట్నాలిచ్చి పిల్లలకే పెళ్లళ్లే చేయలేదా?
ఆ దేవుడు మీ కొరకే తన పిల్లలనే ఇవ్వలేదా? ||ఏ తల్లిదండ్రులైనా||


Ye Tallidandrulaina Song Lyrics in English

Scroll to Top