Skip to content
Home » బైబిల్‌నే తప్పంటే | Biblene Tappante

బైబిల్‌నే తప్పంటే | Biblene Tappante

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


బైబిల్‌నే తప్పంటే దేవున్నే లేడంటే
వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం
యేసుక్రీస్తు మీద తప్పుడు మాటలంటే
నీ నోరు మూయించే మేమందరమున్నాము
యేసు జోళికొస్తే మేమే ఊరుకోము
బైబిల్‌ జోళికొస్తే మేమే ఊరుకోము
ఎదుటివారికున్న విశ్వాసము విమర్శించే హక్కు లేదు
ఎదుటి వారునమ్మే ఏ గ్రంధము విమర్శించే హక్కు లేదు
చట్టాన్ని ఎదురించి బైబిల్‌నే తప్పంటే శిక్షే ఖాయం
సర్వజ్ఞానమే కలిగి ఉన్నదే బైబిలే దైవగ్రంధం ||బైబిల్‌నే||

1. రోషమున్నా ఆ దేవుని కోసం ఏలీయా అగ్ని దించలేదా?
సూర్యచంద్రులను ఆపి ఆనాడే యెహోషువా యుద్ధం చేయలేదా?
షడ్రక్‌, మేషెక్‌, అబేద్నగో రాజుకై నా వారు మ్రొక్కలేదు
దానియేలునే బంధించినా సింహల నోరే మూయించెను
దేవున్నే కాదంటే రాజైనా మేం మ్రొక్కమూ ||బైబిల్‌నే||

2. సమ్సోనే ఆ దేవుని కోసం స్ధంభాలే కూల్చి చంపలేదా?
ఇశ్రాయేలీయుల రక్షణ కోసం ఫరోకే బుద్ధి చెప్పలేదా ?
పౌలును సీలను బంధించినా వాక్యాన్ని ఆనాడే అందించెను
యోహాన్ని పేతుర్ని బెదిరించినా ఎదిరించి వాక్యాన్ని ప్రకటించెను
దేవున్నే గెలిపించి సాతన్నే గెలిపిస్తాము.. ||బైబిల్‌నే||


Biblene Tappante Song Lyrics in English