Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
తండ్రియైన దేవునికి పిల్లలు కావాలి
అందుకే వివాహం ఘనమైనది (2)
స్త్రీ పురుషుల కందుకే పెళ్లి కావాలి
స్త్రీ పురుషుల కందుకే పెళ్లి కావాలి
ఈ భూమిని నిండిరచాలి
తన కలకలను పండించాలి (2)
ఎందుకో మనిషికి తెలియకున్నది
తండ్రియైన దేవుని అనాది సంకల్పమని ||తండ్రియైన||
1. నేలమంటి నుండి దేవుడు నరుని చేసెను
గాఢనిద్ర కలుగజేసి స్త్రీని తీసెను (2)
మీరు ఫలించి భూమిని నిండించి
సృష్టినంత ఏలుమని వారికిచ్చెను (2)
తన పోలికతో మీరు కనాలని
తన రూపంతో తనకు కావాలని (2)
దైవజ్ఞాన మందు వారిని తీర్చిదిద్దాలని ||ఎందుకో||
2. పెళ్లియైన వారికందరూ బహుమతులిస్తే
గర్భఫలం దేవుడిచ్చు బహుమానమే (2)
దేవుడు లేడనే వారితో మీ పిల్లలు వాదించి
దేవుడున్నాడని రుజువు చేయాలి (2)
మీ పిల్లల నిలాగె పెంచాలని
మీ పిల్లలు ఇలాగె పెరగాలని (2)
తండ్రిగూర్చి తెలుపుటకే క్రీస్తు జన్మించెను
ఎవరికి తెలుసు.. ఆ తండ్రి మనసు..
తన కోసం మనలను కన్నాడని ||తండ్రియైన||
Tandriyaina Devuniki Pillalu Kavali Song Lyrics in English