Skip to content
Home » కనుమూయక ముందే | Kanumooyaka Munde

కనుమూయక ముందే | Kanumooyaka Munde

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని (2)
ఈ భూమి పై ఎందరో పుట్టారు
ప్రతి పుట్టినరోజు చావుకు దగ్గరవుతారు (2)
తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి (2)
నిన్ను అర్ధాంతరంగా వదిలి వేస్తుంది (2)
మట్టి నుండి పుట్టింది మట్టికి చేరింది
ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తుంది
తెలుసుకో ఈ నిజాన్ని
నీ శరీరమే నీకు శత్రువని (2) ||కనుమూయక||

1. మేనుపైన మమకారం పెంచుకోకుమా
మరణించగానే ఎవరూ నిను ఉంచుకోరు సుమా (2)
ఆశా మమకారలు పెను ఉచ్చులు సుమా
నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలనే మరువకుమా (2)
నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలనే మరువకుమా ||తెలుసుకో||

2. నీ దేహం దేవునికై వినియోగిస్తే
నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే (2)
మన్నయిన నీ దేహాం మహిమగా మారును
అంతరిక్షమే దానికి అడ్డుతొలగి పోవును (2)
పుట్టి తెలుసుకున్నావీ లోకముందనీ
మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని (2)
తెలుసుకో ఈ నిజాన్ని
నీ మృత్యువు వెనుకే ఉంది మిస్టరీ
దైవ గ్రంధం తెలిపింది దాని హిస్టరీ ||కనుమూయక||


Kanumooyaka Munde Song Lyrics in English