తన కోపమాపుకున్న | Tana Kopamapukunna

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


తన కోపమాపుకున్న నీ తండ్రి దేవుడొకడే
తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే
ప్రతి దినము కోపపడు అతడే దీర్ఘశాంతముతో ఉన్నాడు
పాపమే చేస్తున్నా చూస్తు శిక్షించకుండా ఉన్నాడు
మారాలనీ.. నువు మారాలనీ, మార్చాలనీ… నిన్ను మార్చాలనీ
||తన కోపమాపుకున్న||

1. ఏ దినము నీకొరకు ఏం చేసాడో దాన్ని రాసాడు తన లేఖలో
తన లేఖలన్నిటిని గ్రంథముగా ముద్రించి పెట్టాడు నీ చేతిలో
ప్రేముంది, పగ ఉంది, భాదుంది, చింతుంది మనసంతా చెప్పేసినాడు
తన మాటె వినకుంటే తన చెంతకు రానంటే నువు దక్కవని తెలిపినాడు
మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు
తన మనస్సులో ఉన్నది రాసాడు ఆ దేవుడు ||తన కోపమాపుకున్న||

2. ఆకాశమే చూడు ఎంతున్నది ఈ భూమిపై చూడు ఎన్నున్నవి
అందులో ప్రేమ కోలవాలనీ తెలుసా? అది తెలుసా?
ఆకలేస్తుందనీ నీకని, చెట్టు చేయాలనీ వంటనీ
రుచిచూడు ఆ తండ్రి ప్రేమా కొలవాలి ఆ తండ్రి ప్రేమా..
నీ కోసమే చూడు ఎన్నున్నవి ప్రాణాలు ఇస్తున్నవీ
నీకని కొలవాలి ఆ తండ్రి ప్రేమా… చూపించు నీకున్నా ప్రేమా
మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు
తన మనసులో ప్రేమనీ చూపించాడు ఆ దేవుడు ||తన కోపమాపుకున్న||


Tana Kopamapukunna Song Lyrics in English

Scroll to Top