Skip to content
Home » ప్రేమించలేదని | Preminchaledani

ప్రేమించలేదని | Preminchaledani

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ప్రేమించలేదని మరణించుటే న్యాయమా?
ప్రేమించలేదని ప్రాణం తీసావుగా!
ప్రేమ అన్నది దేవునిలోనే ఉన్నది (2)
ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే
ఇలాంటి ప్రేమే లేదే ఏ ప్రేయసిలోనే ||ప్రేమించలేదని||

1. ప్రేయసికంటే, ప్రియునికంటే దేవుడే ముందు ఉన్నాడుగా
ప్రేమంటే ఏంటో ఎలా ఉంటుందో దేవుడె ముందు చూపాడుగా (2)
ఆదాము కొరకు హవ్వను చేసి దేవుడే ఇచ్చాడు,
అందరి కొరకు అన్నీ చేసి ముందే ఇచ్చాడు,
ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే
ఇలాంటి ప్రేమే లేదే నీ ప్రియునిలోనే ||ప్రేమించలేదని||

2. శత్రువునైనా, మిత్రుడినైనా ప్రేమించాడు దేవుడేగా
దేవుని ప్రేమ నీకుంటే నీ ప్రేయసి ప్రాణం తియ్యవుగా (2)
ప్రేమించి దేవుడు అన్నీ ఇస్తే ప్రేమించకున్నావు
అసలేమి ఇవ్వని ప్రేయసి కోసం పడిసచ్చిపోతావు
ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే
ఇలాంటి ప్రేమే లేదే వీరిద్దరిలోనే ||ప్రేమించలేదని||


Preminchaledani Song Lyrics in English