తల్లిదండ్రులు ఎందరో ఉన్నా | Tallidandrulu Endaro Unna

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


తల్లిదండ్రులు ఎందరో ఉన్నా మీ పిల్లల రూపం మీదేలే
దేవుడు పిల్లలనిస్తున్నా ఆ పిల్లల రూపం మీదేలే
మీ పిల్లలలో మీ రూపం చూసుకొని
నాలాగే ఉన్నాడని చెప్పుకొని
‘‘మురిసి పోతున్నావు నీవు నిను ఆనంద పరచింది ఎవరు?’’ (2)
||తల్లిదండ్రులు||

1. మీలా పుట్టాలని అనుకుంటారు ఈ కోరిక తీర్చింది ఎవరు?
మీ రూపం రావాలని అనుకుంటారు ఆ రూపం ఇచ్చినది ఎవరు?
మీ రూపం అరచేతిలో తను చెక్కుకొని
తల్లి గర్భంలో వస్తుంటే చూసుకొని (2)
చూసాడు ముందే ఆ దేవుడు
అతని తరువాత చూసే ముద్దాడావు నీవు (2) ||మురిసి పోతున్నావు||

2. అమ్మా అని పిలవాలని అనుకుంటావు నీ గర్భాన్ని నిలబెట్టింది ఎవరు?
నాన్నా అని పిలవాలని అనుకుంటావు ఈ స్వరపేటిక ఇచ్చింది ఎవరు?
మీ పిల్లలపై ప్రేమంతా పెట్టుకొని
అతనేడిస్తే ఏమైందని ఎత్తుకొని (2)
మీకిచ్చింది తన పిల్లలనా దేవుడు
మీ పిల్లలు తన పిలల్లని చెప్పాలి నీవు (2) ||మురిసి పోతున్నావు||


Tallidandrulu Endaro Unna Song Lyrics in English

Scroll to Top