Skip to content
Home » స్వర్గానికి యేసే ఆ దారి | Swarganiki Yese Aa Dari

స్వర్గానికి యేసే ఆ దారి | Swarganiki Yese Aa Dari

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


స్వర్గానికి యేసే ఆ దారి దేవుని చూస్తావు ఒకసారి (2)
దేవుడెవరని? తెలిపింది అతతని
తనలా ఉంటాడు నువు చూసుకో అని (2)
కనిపించని దేవుని ప్రతిరూపం నువు చూడాలని పంపాడీ రూపం
తన కొరకు నీవు తెలుసుకో ఆ దేవుని నువు కలుసుకో
నీ జన్మను నువు తెలుసుకో ||స్వర్గానికి||

1. ఏ కాలమందు అతని చూడలేదు ఎవరూ
ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరూ (2)
దేవుని చూస్తే నరుడే బ్రతకడు అతని చూసే శక్తీ కళ్లకు లేదు
చూసాడు యేసే పరలోకంలో దేవుని
చూసింది అతనే పరలోకంలో అత్మని
యేసును చూసే దేవుని తెలుసుకో
బయలుపరచింది యేసని చదువుకో
ఈ నరులెవరూ చూడలేదు తెలుసుకో ||స్వర్గానికి||

2. చూడాలి నీవు వాక్యంలో దేవునిని
నమ్మాలి నీవు విశ్వాసంతో అతనిని (2)
వినుట వలన విశ్వాసం కలుగును
విని నమ్మితే స్వర్గం నీకే దొరుకును
ఆదాము నుండి దేవుని చూడలేదు
ఆ దేవుని చూసే భాగ్యం ఎవరికి లేదు
చూడాలనుకున్నారు దేవుని
యేసు వస్తే నువు చూస్తావు దేవుని
మరణించే నువు చూడాలి దేవుని ||స్వర్గానికి||


Swarganiki Yese Aa Dari Song Lyrics in English