Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
సమాధినే గెలిచాడు ప్రభు యేసు
సజీవుడై లేచాడు మూడో రోజు (2)
సమాధి వెదకకు సంఘమా ప్రతి ఏడూ
ఉపవాసలతో ఏడ్చెదవు లెంటు డేసులని
నీ కొరకై నీ పిల్లలకై అన్యులకై ప్రతి వారికై
ఆత్మలు రక్షించుటకై నీవు కదలాలి
ఆ సమాయాన్నొచ్చే ఉపవాసమునూ భరియించాలి
సమాధినే గెలిచాడు ప్రభు యేసు సువార్తనే చాటాలి ప్రతి రోజు ||2||
1. మీరుపవాసం ఉంటారు – మీ భోజనమేమో ఖర్చుకాదు
ఆ భోజనం వేరేవారికి – పెట్టి వాక్యం చెప్పరు
బూడిద చల్లుక కూర్చోని – గోనె పట్టలు కట్టుకొని
నీరసంగా ముఖమును పెట్టి ఉపవాసాలే చేస్తారు
ఆ యూదులు చేసే ఉపవాసం – క్రైస్తవులకది అపచారం ||2||
దేవుడు లేడనె దుర్మారుల్గకు దేవుడు ఉన్నాడని చెప్పాలి
పాపభారమను కాడి మ్రానుని – మోసేవారిని కాపాడుటకై
కదలాలి యింటి నుండి – కదాలాలి సంఘాలన్ని
ఇవియే ప్రభువుకు – యిష్టమైన ఉపవాసాలు
ఈ ఉపవాసాలు చేస్తున్నారా క్రైస్తవులు
సమాధినే గెలిచాడు ప్రభు యేసు – సువార్తనే చాటాలి ప్రతి రోజు ||2||
2. పాపుల కోసం ప్రభు యేసు – సిలువను మోసే వేళలో
ప్రభువు కోసమే ప్రజలంతా కన్నీళ్ళు పెట్టే వేళలో ||2||
అమ్మాలారా నాకోసం – ఏడవకండనె ఆ యేసు
అ యేసుని మాట మరచి – ఏడ్చుట న్యాయమా ? అది యేసుకి ఇష్టమా?
సమాధినే గెలిచాడు ప్రభు యేసు – సువార్తనే చాటాలి ప్రతి రోజు ||2||
Samadhine Gelichadu Prabhu Yesu