Skip to content
Home » ఇదిగో దేవా నా జీవితం | Idigo Deva Naa Jeevitam

ఇదిగో దేవా నా జీవితం | Idigo Deva Naa Jeevitam

Songs Home Page       All Telugu Christian Songs       All Andhra Kraistava Keertanalu


ఇదిగో దేవా నా జీవితం – ఆపాద మస్తకం నీకంకితం
శరణం నీ చరణం – శరణం నీ చరణం (2)

1. పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు – నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా – ఈ నా యల్ప జీవితం

2. నీ పాదముల చెంత చేరి – నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి – ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నన్నుండనిమ్ము

3. విస్తార పంట పొలము నుండి – కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు – కలకాలం మరినాకు నొసగు
క్షేమక్షామ కాలమైనా – నిన్ను ఘనపరచు బ్రతుకునిమ్మయా
నశియించు ఆత్మలన్ – నీదరి చేర్చు కృపనిమ్మయా


Idigo Deva Naa Jeevitham
Aapaadamastakam Neekankitam (2)
Sharanam Nee Charanam (4) ||Idigo||

1.Palumaarlu Vaidolaginaanu
Paraloka Darshanamunundi
Viluvaina Nee Divya Pilupuku
Ne Taginatlu Jeevinchanaiti (2)
Ainaa Nee Premato
Nannu Dari Cherchinaavu
Anduke Gaikonumu Devaa
Ee Naa Yalpa Jeevitam ||Idigo||

2.Nee Paadamula Chenta Cheri
Nee Chiththambu Neneruga Nerpu
Nee Hrudaya Bhaarambu Nosagi
Prarthinchi Panicheyanimmu (2)
Aagipoka Saagipovu
Priyasutuniga Panicheyanimmu
Prati Chota Nee Saakshigaa
Prabhuvaa Nannundanimmu ||Idigo||

3. Vistaara panta polamu nundi
Ne kastinchi panicheya nerpu
Kanneetito vittu manasu
Kalakaalam marinaaku nosagu
Kshema kshaama kaalamaina
Ninnu ghanapariche bratukunimmayaa
Nasiyinchu Aatmalan
Nee daricherchu krupanimmayaa ||Idigo||