రక్షకుడే శిక్షకుడై | Rakshakude Sikshakudai

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు (2)
దయ చూపే దేవుడే
దహించుటకు నిలుచున్నాడు (2)
ప్రేమను పగగా చూపించి
ఆరని అగ్నిని నీపై కురిపించి (2)
తరతరాలుగా తరగని శిక్షకు
తరలిస్తున్నాడు (2) ||రక్షకుడే శిక్షకుడై||

1. భారము మోసే నా ప్రజలారా
రండని పిలిచిన దేవుడే
భారము మోసే నా ప్రజలారా
రండని పిలిచిన రక్షకుడే
అక్రమమును చేసే మీరు
పొండని చెప్పే ఆ ఘడియే (2)
పరలోకానికి పోలేక… ఈ లోకానికి రాలేక… (2)
ప్రేమామయుడే ప్రేమించువాడని
పొరపాటు పడుచున్నావా ?
కరుణామయుడే కరుణించువాడని
పొరపాటు పడుచున్నావా ?
పాతాళానికి పోవాలి
అగ్నికి ఆహుతి కావాలి (2) ||రక్షకుడే శిక్షకుడై||

2. అవిధేయులను జలప్రళయంలో
ముంచేసాడు ఆనాడు
కామాంధులను సొదొమాలో
కాల్చేసాడు మరునాడు
సృష్టికి భయపడే నీవూ
సృష్టికర్తకు భయపడవా (2)
ప్రేమామయుడే ప్రేమించువాడని
పొరపాటు పడుచున్నావా ?
కరుణామయుడే కరుణించువాడని
పొరపాటు పడుచున్నావా ?
పాతాళానికి పోవాలి
అగ్నికి ఆహుతి కావాలి (2) ||రక్షకుడే శిక్షకుడై||


Rakshakude Sikshakudai Vastunnadu

Scroll to Top