Skip to content
Home » శాస్త్రానికందని నిర్మాణమా | Sastranikandani Nirmanama

శాస్త్రానికందని నిర్మాణమా | Sastranikandani Nirmanama

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


శాస్త్రానికందని నిర్మాణమా?
మానవ శరీర ఆకారమా? (2)
పిల్లలు కావాలని కోరుకున్నా
కలుగట లేదు కారణమేమని? (2)
యోచించుమా… ఓ మానవా…
నీ జన్మదినమే… రహస్యమా ?
అనాది దేవుని సంకల్పమా? ||శాస్త్రానికందని||

1. పూతపూస్తుంది కోటానుకోట్లు
పండ్లుగా మారును వందలుగా
నేలరాలును పువ్వంతా (2)
తల్లిగర్భంలో వెళ్లిన ప్రతి కణము
నేలరాలును కోట్లుగా
దేహన్ని యిచ్చును కొన్నిటికే
ఏ క్షణము కలిసిందో ఎవరికి తెలియదు
పిండముగా మారినది దేవునికే తెలుసు
నీ జన్మదినమే… రహస్యమా ?
అనాది దేవుని సంకల్పమా ? ||శాస్త్రానికందని||

2. పిల్లలు కావాలని
కోరుకున్నాడు జగత్తు ముందే
ఆరు దినాలు కష్టపడి
చేసాడు సృష్టి పిల్లల కోసం (2)
తన కొరకు బ్రతకాలని…
తన సేవ చేయాలని…
అరచేతిలో చెక్కుకొని
తన కళ్లతో చూసుకొని
పిండమునై యుండగా
గర్భములో నుండగా… ||శాస్త్రానికందని||


Sastranikandani Nirmanama?