నీ గుండెలో ఆ చప్పుడే | Nee Gundelo Aa Chappude

నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా?
ఆ దేవుడే ఇంత కాలమే ఎందుకిచ్చాడో తెలుసా?
దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా?
ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా?
పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో (2)
||నీ గుండెలో||

1. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది
తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది (2)
నీ ప్రాణం ప్రియునికి కాదని, ప్రాణమివ్వాలి ప్రభువుకేనని
నీ ప్రాణం నీకేకాదని, ప్రాణమివ్వాలి ప్రభువుకేనని
పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో
||నీ గుండెలో||

2. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి పంతో పని ఉంది
దేవుని పనినే నువు చేయాలని నీ పని చేస్తుంది (2)
నీ జననం జరిగిందిందుకే ఈ ప్రకృతి చేసాడందుకే (2)
పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో
||నీ గుండెలో||


Nee Gundelo Aa Chappude Song Lyrics in English

Scroll to Top