నామకార్ధ బోధకుడా | Namakardha Bodhakuda

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


నామకార్ధ బోధకుడా
అనుకూల బోధ చేయకురా
ఖంఢించు, గద్దించు,
వాక్యంతో బుద్ది చెప్పు క్రైస్తవ్యానికీ (2)
బ్రతుకుట కొరకే బైబిలు పడితే
బ్రతుకుటకొంకే బోధను మార్చితే
మరికఠినమైన తీర్పు ఉంది
బోధకులందరికీ సోదరా! (2)

1. గుడి అంటే గోపురం గోడలని
తప్పుగ బోధిస్తే శిక్ష తప్పదని (2)
మందిరాలు కడతామని – మంద ఎక్కువయ్యారని
సిమ్మెంటుతో కట్టేది గుడికాదు (2)
దేహామే దేవాలయం – ఆత్మకే అది ఆలయం
దేహామే దేవాలయం – పరిశుద్దాత్మకే అది ఆలయం
ఆత్మకు వ్యతిరేకంగా – ఆలయమే కడితే
క్షమాపణే లేదు సోదరా! ||నామకార్థ||

2. వినుటవలన విశ్వాసం కలగాలి
క్రీస్తు మాటవిని మనిషి విశ్వసించాలి (2)
రోగాలను తీస్తామని – ప్రార్దనలు చేస్తామని
యేసు పిలిచెనని చెపితే – అది నేరం (2)
దేహామే నిష్ప్రయోజనం
జీవవాక్యమే ఆత్మకు అవసరం (2)
ఆత్మకు వ్యతిరేకంగా – అక్రమమే చేస్తే
క్షమాపణే లేదు సోదరా! ||నామకార్థ||


Namakardha Bodhakuda Song Lyrics in English

Scroll to Top