Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
మీలో ఒకడు సాతానని
యేసే చెప్పాడు యూదా అని (2)
ఆదామైనా, అబ్రహామైనా, దావీదైనా, సొలొమోనైనా
చేసింది పాపమే వారు సాతానుగా మారలేదు (2) ||మీలో ఒకడు||
1. కలిసుండాలి మీరు విడిపోకూడదెవరు
బర్నబా మార్కు పౌలునే విడిచి వెళ్లినాడు అపుడు (2)
వాక్యంతో కలిసుండని వాడు క్రీస్తుకే విరోధతడు
తన సోదరులను ప్రేమించనివాడు అప్పుడే నరహంతకుడు
విశ్వాసితో కలిసుండని ప్రతివాడు సాతానే ||మీలో ఒకడు||
2. ఎదుటి వారి పాపాలను ఎత్తేవాడే అతడు సాతాను
సహోదరులపై నేరము మోపిన వాడే అతడు సాతాను
ఈ మనసే నీకుందా అయితే నీలో ఉన్నాడు (2)
దేవుని పిల్లలనభ్యంతర పరిచే వీడే సాతాను ||మీలో ఒకడు||
Meelo Okadu Satanani Song Lyrics in English