Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
మనుషులలోనే కలుగలేదు ఈ ప్రేమ
మనిషి పుట్టక ముందే పుట్టినదీ తొలిప్రేమ
తల్లి తండ్రిలో కలుగలేదు
బంధుమిత్రులలో కలుగలేదు
ప్రేయసీ ప్రియుడు పుట్టకముందే పుట్టినదీ ప్రేమ
సర్వలోకాన్ని సృష్టించిన దేవుని ఆత్మలో పుట్టిన తొలిప్రేమ
ఆత్మలో పుట్టినది ఈ ప్రేమ పరమాత్మలో పుట్టినదీ తొలిప్రేమ
||మనుషులలోనే||
1. దేవుడే నిన్ను ప్రేమించాడు
నీకు కావాలని నీకోసం సృష్టిని చేసాడు (2)
అడగకముందే అన్నీ ఇచ్చినదెవరు?
ఆరుదినాలు సృష్టిని చేసినదెవరు?
దేవుడే నిన్ను ప్రేమించి నీకోసమే సృష్టి కలిగించి
తల్లిదండ్రులను నీకిచ్చి తల్లి కంటే ప్రేమచూపి
నిన్ను కావాలని కోరుకున్నది నీ తండ్రి (2) ||మనుషులలోనే||
2. పాపినైన నిన్ను ప్రేమించాడు
పరమందు నిన్ను చేర్చాలని క్రీస్తును పంపాడు (2)
దేవుని ప్రేమలో ఉన్నది మనిషికి రక్షణ
మనుషుల ప్రేమలో ఉన్నది ఆకర్షణ
దేవుడే నిన్ను ప్రేమించి నీకోసమే సృష్టి కలిగించి
తల్లిగర్భంలో నిలబెట్టి తనకళ్లతో నిన్నుచూసి
నిన్ను కావాలని కోరుకున్నది నీతండ్రి
నీవు రావాలని కోరుక్నుది నీతండ్రి (2) ||మనుషులలోనే||
Manushulalone Kalugaledu Song Lyrics in English