మనిషి జన్మ వింతే | Manishi Janma Vinte

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


మనిషి జన్మ వింతే అది తెలియకుంటే చింతే
నీ నిర్మాణమే తెలుసుకోవా
బ్రతుకు కుంది అర్ధం అది తెలియకుంటే వ్వర్ధం
నీ బ్రతుకెందుకో తెలుసుకోవా
దేహాన్ని దేవుడు నిర్మించి దేవుడు నీలోనే ఉండాలనీ
దేహమే ఆలయం ఎవరు కట్టలేరు ఈ మందిరం
||మనిషి జన్మ వింతే||

1. ఎవరు చెయ్యలేరు ఈ దేహం
ప్రపంచ వింతలకే ఒక వింతని…
మనిషి చెయ్యలేడు ఈ దేహం
మానవ మేథస్సుకు మరుగైనది…
కన్నుపోతే కన్ను చేయలేడు
కాలుపోతే కాలు చేయలేడు
చెయ్యిపోతే చెయ్యి చేయలేడు
కన్నుమూస్తే చెప్పి పంపగలడు
దేహాన్ని దేవుడు నిర్మించి ఇచ్చిన ఈ వింత నిర్మాణమూ…
దేహమే మనిషికి అందని అద్భుతం అద్భుతం
||మనిషి జన్మ వింతే||

2. ఎవరు చేయలేరు ఈ రూపం
మనుషుల వేలి ముద్ర ఒక వింతని…
మనిషి చేయలేడు ఈ రక్తం
మరో మనిషి నాశ్రయించాలని…
తాజ్‌మహల్‌నయినా తిరిగి కట్టగలడు
తలవెంట్రుకనైన నలుపు తెలుపు చేయలేడు (2)
దేహాన్ని దేవుడు నిర్మించి దేవుడు నీలోనే ఉండాలని…
దేహమే ఆలయం ఎవరు కట్టలేరు ఈ మందిరం
||మనిషి జన్మ వింతే||


Manishi Janma Vinte Song Lyrics in English

Scroll to Top