Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
లోకాలను కలిగించిన దేవుడు వ్రాసినదే ఈ గ్రంథం
మానవకోటికి చెప్పాలని ఆ దేవుడు వ్రాసిన గ్రంథం
జీవరాశి పుటుక్ట గూర్చి జీవమున్న వృక్షము గూర్చి (2)
కనిపించని ఆ దేవుని గూర్చి వ్రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం
విశ్వవిద్యాలయాలలో, ప్రాధమిక పాఠశాలలో, శాస్త్రవేత్త శాస్త్రాలలో
ప్రభుత్వం పుస్తకాలలో, పరమాత్ముని గూర్చి చెప్పలేదు
ఆ పరమాత్ముడు ఎవరో.. తెలుపలేదు
ఎవరూ చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు
సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి,
సృష్టి లోని ప్రతి అణువు గూర్చి వ్రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం
ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుష్యులందరెవరో తెలుసా? ||లోకాలను||
1. మనుష్యులందరూ వచ్చింది మొదటి మనిషి నుండే
ఆ మొదటి మనిషి పుట్టింది ఆ దేవుని నుండే
భూమి మీద పుట్టిన మనిషి దేవుని కూమారుడే
భూమి మీద పుట్టిన వారంతా దేవునికి పిల్లలే
ఆదామైనా, ఆ యేసైనా, పూర్వికులెవరైనా
మనిషిగా పుట్టిన ఏ మనిషైనా స్త్రీ పురుషులు అయనా
దేవునికే వీరంతా పిల్లలే ఆదాము నమ్మిన దేవుడే దేవుడే
నీకొక దేవుడు నాకొక దేవుడు మనిషికి ఉంటాడా?
దేవుని గూర్చి రకరకాలు ఈ మనుష్యులు చెబుతారా?
ప్రతి తల్లీ చెపుతుంది నీ తండ్రి ఇతడని
నా యేసు క్రీస్తు చెప్పాడు మన తండ్రి దేవుడని ||లోకాలను||
2. కులము, మతము, జాతి, బేధం మనుష్యుల్లోనే ఉంది
కమ్మ, కాపు, వర్గాలన్నీ మనుష్యులకే అది ఉంది
ఆదాముకు లేదు కులం హవ్వకు లేదు కులం
కయీనుకు లేదు కులం హేబేలుకు లేదు కులం
మొదటి మనిషికే లేనే లేదు కులం
ఆ మొదటి మనిషి సంతానమే నేటి జనం
వారందరికి ఒక దేవుడే మనకందరికి ఆ దేవుడే (2)
మనుష్యులందరికి దేవుడు తండ్రే అయితే
ఈ మనుష్యులందరు అతనికి పిల్లలు అయితే
ఒక్కడే ఉంటాడు అతడు తండ్రే అవుతాడు
తండ్రి ఒక్కడే ఉంటాడు తండ్రి దేవుడు అవుతాడు
భారతీయులే సోదరులౌతారా? ఈ మనుష్యులందరూ సోదరులేకారా?
బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం (2)
పాఠశాలలో చెప్పాలి మూలపాఠం దేవుడని
ప్రతి పుస్తకాలలో చేర్చాలి సృష్టికర్తే దేవుడని
ఇది కాదంటే బైబిల్ తప్పంటే దేవుడు లేడంటే
క్రైస్తవుడే ఊరుకోడు వానిని ఎవడూ ఆపలేడు ||ఎవరూ||
Lokalanu Kaliginchina Devudu Song Lyrics in English