Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం
ఆయన తరుపున వాదించుటకే నేసిద్దం (2)
నువ్వు హేతువాదివైనా, నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము
ఇది కాదని దమ్మే నీకుంటే ఓడిస్తాము
దేవుడున్నాడు జాగ్రత్త ! క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త ||ఇది దేవుడు||
1. సృష్టి చేసింది దేవుడే దానికదే ఏది రాదులే
సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే (2)
బస్ నడిపేది డ్రైవర్ ఓడ నడినేది కెప్టెన్
ప్లైట్ నడిపేది ఫైలెట్ ఈ సృష్టినడిపేది దేవుడే (2)
బస్‌నడిపేది, బండి నడిపేది, ఓడ నడిపేది, ప్లైట్ నడిపేది
భూమి విూద నడిపేవన్నీ నరుడే
సూర్య చంద్ర నక్షత్రములన్ని భూమి విూద ఈ కాలములన్ని
గ్రహాలన్ని నడిపిస్తుంది దేవుడే
గాలినే చూడగలవా? అది లేదని చెప్పగలవా?
సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు నీ కళ్లకుకనిపించని శక్తిగా అతడున్నాడు
దేవుడున్నాడు జాగ్రత్త ! క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త ||ఇది దేవుడు||
2. నరుని చేసింది దేవుడే వానరుని నుండి రాలేదులే
మనిషిలోని అణువణవు చేసింది దేవాది దేవుడే (2)
విత్తు ముందా? చెట్టు ముందా? కోడి ముందా? గుడ్డు ముందా?
ఎవరికంటే మరి ఎవరు ముందో చెప్పుతాను నువ్వు తెలుసుకో
చెట్లుముందే కోడి ముందే నిన్ను కన్న నీ తండ్రి ముందే
ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో
నీతండ్రినే నమ్మలేదా? అని నమ్మకం నీకు కాదా?
సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు
నీ కళ్లకు కనిపించని శక్తిగా అతడున్నాడు
దేవుడున్నాడు జాగ్రత్త ! క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త ||ఇది దేవుడు||
Idi Devudu Unnadani Telipe Yuddham Song Lyrics in English
Discover more from SUTotal
Subscribe to get the latest posts sent to your email.