Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ఏదెను తోటలో ఆదాము హవ్వలు
ప్రతి చల్లపూట తన తండ్రితో
ఏ పాపమెరుగని స్ధితిలో (2)
ఆజ్ఞను అతిక్రమించి అపవాది మాటను పాటించి
తప్పు చేశారు తప్పు తండ్రిపై నెట్టివేసారు (2)
చెట్టు వేయుటే నేరమా?
దేవుడు ముందుగా చెప్పకుండెనా ? (2)
తెలుసుకో దీని రహస్యం
చెట్టులోనే ఉంది పరమార్ధం (2) ||ఏదెను తోటలో||
1. చెడు చేయడానికవకాశముండి
చెడు చేయనివాడు గొప్పవాడా ?
చెడు చేయడానికవకాశమే లేక
చేయనివాడు గొప్పవాడా ? (2)
నీ గొప్పతనాన్ని నిరూపించుకో
మంచి చెడులు యోచించి తెలుసుకో ||చెట్టు వేయుటే||
2. మంచివాడవని నిరూపించుటకు పరీక్ష ఉండాలి
గొప్ప వాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి (2)
చెడు చేయకుండనే చెడును తెలుసుకో
దైవ లక్షణముందని ఋజువు చేసుకో (2)
చెట్టు ఉన్నా ఫలము తినని వాడే గొప్పవాడు
చెట్టు వేయకుటే నీ గొప్ప తనానికి అర్ధంలేదు ||తెలుసుకో||
Edenu Thotalo Song Lyrics in English