దేవున్నే నువు నమ్ముకుంటే | Devunne Nuvu Nammukunte

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


దేవున్నే నువు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా?
ఆనాడు ఆ అబ్రహామే ఆ దేవున్ని తెలిపాడుగా
బలిపీఠాలు కట్టాడుగా దేవున్ని ప్రకటిస్తూ వచ్చాడుగా
ఇస్సాకాలాగే చేసాడుగా, యాకోబు మందిరమే కట్టాడుగా
వీరి భక్తీ దేవుడు చూసి వారి దేవుణ్ణని అన్నాడుగా
||దేవున్నే నువు||

1. సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా
నీ నయనాలు చెవులు, నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా (2)
తల్లిని తండ్రిని అన్నా చెల్లిని భార్యను నీవు అందరిని నమ్మావుగా
అన్నిటినిచ్చిన దేవుని నమ్మాలని అంటే సాక్ష్యాలు అడిగావుగా
సృష్టినంతా తాకిచూసి రుచి చూసైనా నమ్మాలిగా ||దేవున్నే నువు||

2. నీకు స్వరమందుకిచ్చాడుగా, బాషలెన్నెన్నో ఇచ్చాడుగా
సర్వలోకనికీ ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా (2)
తల్లిని తండ్రిని అన్నా చెల్లిని అందరిగూర్చి ఎన్నెన్నో చెప్పావుగా
అడగని వారిని పిలిచి అన్నిటి గూర్చి చెప్పి దేవున్నే మరిచావుగా
నీ భక్తి దేవుడు చూసి నీ దేవున్నని చెప్పాలిగా ||దేవున్నే నువు||


Devunne Nuvu Nammukunte Song Lyrics in English

Scroll to Top