Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
దేవుడు కోరుకున్నది మోషే శవమా? శరీరమా?
అపవాది కోరుకుంటుంది నీశవమా? శరీరమా?
అపవాదికే శవమే అవసరవేు లేదు
ఆ దేవునికే శవమే అవసరమే లేదు
బ్రతుకుండగా కావాలి నీవు ఆ దేవునికే
బ్రతుకుండగా కావాలి అపవాదికే
ఎటువైపెళతావో నీవు కోరుకో
ఆ దేవుని గెలిపిస్తావో నిర్ణయించుకో
తెలుసుకో నీపై పోరాటం తెలుసుకో
మంణించక ముందే దేవుని గెలిపించుకో ||దేవుడు కోరుకున్నది||
1. పసికందుగున్న మోషేను చంపాలనీ చూచెను
ఆ దేవుడే ఫరో కోటలో పెంచాలని పంపెను (2)
ఐగుప్తు సింహాసనం వద్దనీ తన ప్రజలతో శ్రమలున్నా మేలనీ
గెలిపించాడు ఆ మోషే ఆనాడు ఆ దేవుని
గెలిపించవా? నినుకోరితే ఈనాడు ఆ దేవుని ||తెలుసుకో||
2. పసికందుగున్న ఆ యేసును చంపాలనీ చూచెను
ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను (2)
లోకాధికారాలనే చూపినా రారాజుగా చేయాలని వచ్చినా
అర్పించాడు తన ప్రాణం మన కొరకు బలిపశువుగా
గెలిపించవా నిను కోరితే ఈనాడు ఆ దేవుని ||తెలుసుకో||
Devudu Korukunnadi Moshe Savama Sareerama Song Lyrics in English