Skip to content
Home » యేసే లేకుంటే పాపమే పోదులే | Yese Lekunte Papame Podule

యేసే లేకుంటే పాపమే పోదులే | Yese Lekunte Papame Podule

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


యేసే లేకుంటే పాపమే పోదులే పాపం ఉంటే స్వర్గము లేదులే (2)
పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు సర్వ లోకానికి నిన్నే చెప్పమన్నాడు
పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు నమ్మినవారే ప్రకటించాలన్నాడు
క్రీస్తునందు ఉన్నవారికే శిక్షే లేదు ||యేసే లేకుంటే||

1. నేరం చేస్తే చట్టమే వదలదు నేరం రుజువైతే మనిషే విడువడు
మనిషిని దోచేవాడే నేరస్తుడు ఐతే
ఆ నేరం చేసిన మనిషిని శిక్షించుట లేదా (2)
బెయిలే దొరకక జైలే విడువక చేసిన నేరానికిన్ని శిక్షలే
నా యేసువలే క్షమియించే వారెవరూ లేరులే ||యేసే లేకుంటే||

2. సృష్టిని ఇచ్చింది మనిషికి దేవుడే బ్రతుకును ఇచ్చింది మనిషికి దేవుడే
సృష్టిని చేసిన దేవుడే లేడనడం నేరం
ఆ దేవుని నమ్మిక పోవుట అది కూడ నేరం (2)
యేసుని నమ్మితే క్షమియిస్తానని దేవుడు పంపాడు పాపి కోసమే
ఆ యేసును నమ్మిన నీ బ్రతుకిస్తేనే స్వర్గమే ||యేసే లేకుంటే||


Yese Lekunte Papame Podule Song Lyrics in English