దేవుడెవరు | Devudevaru

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


దేవుడెవరు? దేవుడెవరు?
దేవుడెవరని సందేహం వలదు (2)
ఈ సృష్టి దేవుడు కాదని,
సృష్టిని త్రిప్పే శక్తి ఉన్నాడని
ఆ శక్తే దేవాది దేవుడని ||దేవుడెవరు?||

1. తిరిగే ఈ భూమిని
పరిభ్రమించే అనంత విశ్వాన్ని (2)
త్రిప్పే శక్తి మనిషికి లేదని,
కనిపించని శక్తి కలిగించెనని,
ఆ శక్తే దేవాది దేవుడని.. ||దేవుడెవరు?||

2. దేవుడు మనిషిని చేసాడు
మనిషి దేవునిని చేయలేడు
తండ్రి కుమారుని కనగలడు
కుమారుడు తండ్రిని కనలేడు
తండ్రి ఎవరో తల్లి చెబితే
నమ్ముతున్నావు నీ తల్లి మాట
శకపురుషుడైన క్రీస్తు మాట నమ్మగలిగితే
నీ తండ్రే దేవాది దేవుడడని.. ||దేవుడెవరు?||


Devudevaru? Devudevaru?

Scroll to Top