దేవుడంటే నీ కిష్టమా | Devudante Neekishtama

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


దేవుడంటే నీ కిష్టమా – ఏ కష్టానికైనా సిద్ధమా? (2)
అవసరాలకే దైవమా – అనుభవించుటే న్యాయమా? (2)
నీ సుఖమే ముఖ్యమా – తన త్యాగమే వ్యర్ధమా?
నీ బ్రతుకే నీ ఇష్టమా నీ బ్రతుకే నీ ఇష్టమా దేవునికే సంతాపమా ?
||దేవుడంటే||

1. హనోకు భూమిపై దేవునితో నడచెను
దేవునికే ఇష్టుడై దేవుడతని తీసుకెళ్ళెను
నువు దేవునికిష్టుడవైతే నినుకూడా తీసుకెళ్లును
తన దూతలనే పంపి లాజరువలె తీసుకెళ్లును
దేవునిలో కష్టపడి రక్షించుట కిష్టపడి
దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి
ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి
వారే తన కిష్టం తన యిష్టం ఎవరికి యిష్టం
||దేవుడంటే||

2. నశియించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు
తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు
క్రీస్తునే నమ్ముటకాక శ్రమపడుటే నేర్చుకోవాలి
నిను చూసిన ఆ దేవుడే దూతలతో పొంగి పోవాలి
ఒక్కపాపి మారితే ఒకరిని నీవు మార్చితే
అంతకన్న ఆ దేవునికింకేం కావాలి?
ఆ దేవుని పనిలో మరణిస్తే నిను చూడాలి
వారే తన కిష్టం తన యిష్టం ఎవరికి యిష్టం
||దేవుడంటే||


Devudante Neekishtama Song Lyrics in English

Scroll to Top