బ్రతుకు బండికి | Bratuku Bandiki

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


బ్రతుకు బండికి సుఖదు:ఖాలే చక్రాలు
దేవుడే జతపరిచిన వరాలు (2)
ఏ చక్రం లేకుండా బండి పోవునా (2)
సుఖదు:ఖాలు లేక బ్రతుకు సాగునా
నీ బ్రతుకు సాగునా ||బ్రతుకు బండికి||

1. సుఖదు:ఖాలిచ్చటే కలిసుండున
చావుతోనే రెండును విడిపోవును (2)
ఓర్పు సహనంతో భక్తిని సాగిస్తే
ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే (2)
పరలోకంలో ఫలం ప్రభుచెంతనే మనం
నిలిచియుందుము కలకాలము (2) ||బ్రతుకు బండికి||

2. క్రైస్తవ జీవితమే పోరాటము
బ్రతకడానికెందుకింత ఆరాటము (2)
శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు
హింసలు లేకుంటే పరలోకం రాదు (2)
కష్టాల కలిమిలో ఇబ్బందుల కొలిమిలో
పరీక్షించును నిను దేవుడు (2) ||బ్రతుకు బండికి||


Bratuku Bandiki Song Lyrics in English

Scroll to Top