Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని
భ్రమపడుచున్నావా (2)
చచ్చి బ్రతుకుతుంది ప్రతీ విత్తనం (2)
నీవు విత్తినది చచ్చి బ్రతుకుచుండగా
నీవు విత్తినదే చచ్చి బ్రతుకుచుండగా
నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా ?
మరో బ్రతుకు లేదన్నది ఎవడురా? ||బ్రతికి చస్తావా||
1. గొంగళి తన రూపమునూ మార్చుకున్నది
సీతాకోక చిలుకగా ఎగురుచున్నది (2)
ఆ రూపము కొరకే … దాచుకున్నది…
ఆ రూ పము కొరకే … కలలుకన్నది…
సృష్టిలో ప్రధముడా – దేవుని కుమారుడా (2)
నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా ?
మరో బ్రతుకు లేదన్నది ఎవడురా ? ||బ్రతికి చస్తావా||
2. ప్రతీ చెట్టు పెరుగుచున్నది నీ కోసమే
ప్రతీ జీవి బ్రతుకుచున్నది నీ కోసమే (2)
బ్రతికి బలౌతుంది నిన్ను బ్రతికించుట కొరకే
బ్రతకాలి నీవు దేవుని కొరకే
చావే ముగింపు కాదని
ఆత్మకు చావు లేదని (2)
ప్రకటించి మరణించి తిరిగి లేచెను
సజీవుడైనాడు శకపురుషుడైన క్రీస్తుయేసు ||బ్రతికి చస్తావా||
Bratiki Chastava Song Lyrics in English
Discover more from SUTotal
Subscribe to get the latest posts sent to your email.