Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
ఆదియందు దేవుడు సృష్టి చేయగా
ఆదియందు దేవుడు స్వరూపమియ్యగా
ఆ స్వరూపమే ఆదాము రూపము..
ఆస్వరూపమే యేసు రూపము..
యేసు రూపమందు నిన్ను మార్చివేయగా (2) ||ఆదియందు||
1. నేలమంటి నుండి నరుని నిర్మింపగా
జీవాత్మ నూది జీవింప జేయగా (2)
భూమి యొక్క అగాధ స్ధలము నుండి తీయగా
జున్నుగడ్డ వలెను నన్ను పేర బెట్టగా
ఆ స్వరూపమే ఆదాము రూపము..
ఆ స్వరూపమే యేసు రూపము..
యేసు రూపమందు నిన్ను మార్చివేయగా (2) ||ఆదియందు||
2. నా తల్లి గర్భమందు నన్ను చూడగా
నా అంతరింద్రియములను కలుగజేయగా (2)
నా దినములన్నియూ లిఖింపజేయగా
నీతి మార్గమందు నన్ను నిలువబెట్టగా
ఆ స్వరూపమే ఆదాము రూపము..
ఆ స్వరూపమే యేసు రూపము..
యేసు రూపమందు నిన్ను మార్చివేయగా (2) ||ఆదియందు||
Aadiyandu Devudu Song Lyrics in English