దేవుని ఆకలి | Devuni Akali

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


దేవుని ఆకలి తీర్చెదెవరూ? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు?
ఆ దేవునికే ఆకలి ఉందా? ఈ మనుష్యులు పెడితే అది తీరుతుందా
తెలియని ఆహారం తనకుంది ఇవ్వవా అతనికి
నీకిచ్చిన పిల్లలె తనకివ్వాలి ఇవ్వవా సువార్తకీ
మనిషికి ఆకలి తీరింది ఆ దేవునికే పస్తే మిగిలింది ||దేవుని ఆకలి||

1. తన పిలల్లు వస్తే తల్లి కడుపు నిండుతుంది
తల్లివి కాదంటే తల్లి కడుపుమండుతుంది (2)
తన కలలను పండించాలని పగలే ఉంది
నువు నిదురే పోవాలని రాత్రే ఉంది
మనిషికి నిదురే తీరింది తన కంటికి కునుకేరాకుంది ||దేవుని ఆకలి||

2. తన ఆకలి తీర్చే తన తనయుడు రావాలి
తన మాటాలు చెప్పే అపొస్తలులే కావాలి
తన ఆకలి తీర్చే తనయులు రావాలి
తన మాటలు చెప్పే మనమే రావాలి
తనకొరకే ప్రాణం పెట్టే పిల్లలు ఏరీ
తన కొరకే పెళ్లే వద్దనే మనుషులు ఏరీ
మనిషికి కోరిక తీరింది తన పిల్లలు రారని తెలిసింది ||దేవుని ఆకలి||


Devuni Akali Song Lyrics in English

Scroll to Top