రష్యా మరియు యుక్రెయిన్, ఇరువురు రాజ్యాధినేతలు కూడా దేవుని మాటలు వింటే మీ భవిష్యత్తు బాగుంటుంది. దేవుని మాటలు పట్టించుకోకపోతే యుద్ధ వాతావరణంలో మీరిద్దరే కాదు, ఇంకా అనేక దేశాలను ఈ యుద్ధమనే ఉచ్చులోనికి లాగి అమాయకులను బలి చేస్తారు. చివరకు మీరు సాధించేది ఏమీ ఉండదు. అది అగ్రరాజ్యమైనా లేక అది పేదరాజ్యమైనా! యుద్ధమనే ఉచ్చులో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ నాశనమవుతారు. ఇది కేవలం అపవాది యొక్క టార్గెట్. వాడి టార్గెట్ను మీరు ముందుగా గ్రహించినవారైతే దేవుని యొద్దకు రండి. దేవుని ముందు మోకాల్లూని, దేవుని సహాయాన్ని కోరుకోండి. దేవుని యొక్క మాటలను స్వీకరించి, మీ బ్రదుకులను చక్కదిద్దుకుంటారని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ…
Russia Ukraine War Crisis – Message from God to Mr. Vladimir Putin
ఈ సంక్షోభ పరిస్థితులలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి దేవుని తరపున కొన్ని సూచనలు చేస్తున్నాను. ఆయన గమనించాలి! మిస్టర్ వ్లాదిమిర్ పుతిన్, మీరు ఎందు నిమిత్తం మీ పొరుగు దేశమైన యుక్రెయిన్ తో యుద్ధాన్ని ప్రారంభించారు? ఏ కారణాన్ని చూపిస్తూ ఈ యుద్ధాన్ని ప్రారంభించారు? దీనికి మీరు చెప్పే కారణం, ఒకవేళ యుక్రెయిన్ నాటో సభ్య దేశాలలో చేరితే ఆ దేశాల వలన మీ దేశానికి ముప్పు ఉంటుందని మీరు తెలియజేస్తున్నారు. అయితే, భవిష్యత్తులో ఏదో జరగబోతున్నదని మీరు ఊహించి ఈ యుద్ధానికి తెగించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ యుద్ధము వలన మీరు పొందే ప్రయోజనమంటూ ఏమీ ఉండదు. మీరు ఈ విధంగా యుద్ధం చేసినంత మాత్రాన నాటో దేశాలను మీరు నిలువరించగలరని, వాటిని మీరు భయపెట్టగలరని అనుకుంటున్నారా? ఇవన్నీ తప్పుడు ఆలోచనలే.
రెండవది, యుక్రెయిన్ మా సొంత భూభాగం అని యుక్రెయిన్ లో ఉన్నటువంటి మనుషులందరూ నా సహోదరులు లాంటి వారిని, మేమంతా ఎప్పటినుంచో ఒకటేనని మీ నోరారా మీరే తెలియజేశారు. మరి మీ సహోదరులను మీరే చంపుకుంటారా? ఒకప్రక్క వారు మా సహోదరులే అని చెబుతూ, మరోప్రక్క ఆ సహోదరులను, వారి కుటుంబాలను నాశనం చేస్తారా? ఆ సహోదరుల యొక్క భూభాగమంతటిని పాడు చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి? మీరు మాట్లాడుతున్న మాటలను ఒకసారి పునరాలోచన చేసుకోగలిగితే మీ మాటలకు మీరే సమాధానం చెప్పగలరా?
అలాగే మూడవది, మేము యుక్రెయిన్ అధ్యక్షునితో మేము పోరాడుతున్నాము; యుక్రెయిన్ సైనికులు, వారి సైనిక స్థావరాలు మాత్రమే మా లక్ష్యం అని మీరు చెప్పారు. ఈ మాటలను ఉల్లంఘించి, యుక్రెయిన్ పౌరుల మీద కూడా మీరు దాడులు చేస్తున్నారు. యుక్రెయిన్ ప్రాంతమంతటినీ మీరు పూర్తిగా మీ వశము చేసుకోవాలనే కోరికతో మీరు యుద్ధం చేస్తున్నారు. కనుక, మీరు మీ యుద్ధమును కేవలం ఆ దేశ అధ్యక్షునితో, మరియు ఆ దేశ సైనికులతో మాత్రమే చెయ్యాలి. మరి, యుక్రెయిన్ పరిసర ప్రాంతమంతా మరియు ఆ దేశమందు నివసిస్తున్నటువంటి జీవజాతులు ఏమి చేసాయి? ఆ దేశంలో నివసిస్తున్న పక్షులూ, ఎన్నో జీవులు, జంతువులు చుట్టూ ఎంతో ప్రకృతి! ప్రకృతిని మీరు ఎంతో గౌరవిస్తారు కదా; మీరు మనిషిని లొంగదీసు కోవాలనుకుంటే కేవలం ఆ మనిషి మీదే కదా తుపాకీ గురి పెట్టాలి. కానీ మనుషులతో యుద్ధం చేస్తున్నాము అనుకుంటూ, ఆ యుద్ధ సమయంలో ఎంతో ప్రకృతిని నాశనం చెయ్యడం లేదా? ఆ ప్రకృతి మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీరు ఎటువంటి సమాధానం చెబుతారు? అక్కడ జీవిస్తూ ఉన్నటువంటి పక్షితో మీకు ఏమైనా వైరము ఉందా? అక్కడ నివసిస్తున్నటువంటి జీవజాతులతో మీకు ఏమైనా వైరము ఉందా? ఆ నేలతో మీకు ఏమైనా శత్రుత్వం ఉందా? మరి అలాంటప్పుడు వాటన్నిటినీ యుద్ధం పేరుతో నాశనం చేస్తున్నటువంటి మీరు, ఆ ప్రకృతి అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానము చెబుతారు? యుక్రెయిన్ దేశములో మీ లక్ష్యాలు కేవలం 10 శాతం మాత్రమే ఉంటాయి. కానీ మిగిలిన 90 శాతం, చుట్టూ ఉన్న ప్రకృతి, అందులో ఉన్న జీవజాతులు. వాటన్నిటినీ మీరు గాయపరుచుచున్నారు; బాధపెడుతున్నారు. ఇప్పుడు వాటికి ఏమని సమాధానం చెబుతారు? మనుషులు నేరం చేస్తే ఆ నేరాన్ని మనుషులకే విధించాలి. అధ్యక్షుడు నేరం చేస్తే అధ్యక్షునికి శిక్ష విధించాలి. సైనికులు నేరం చేస్తే సైనికులకు శిక్ష విధించాలి. పౌరుడు నేరం చేస్తే పౌరులకు శిక్ష విధించాలి. కేవలం వారితోనే మీరు పోరాడాలి. కానీ చుట్టూ ఉన్న ప్రకృతిని నాశనము చెయ్యడానికి ఎవరికీ అటువంటి హక్కు లేదు.
కనుక ఈ విషయాలన్నింటిని మనస్సు పెట్టి ఆలోచిస్తే, భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందనే భయంతో ముందుగా ఈ యుద్ధ చర్యలకు ఉపక్రమించారు; యుక్రెయిన్ లోని మీ సహోదరులను మీరు ప్రేమించలేకపోతున్నారు; అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతా పాడుతున్నారు. ఈ విషయాలలో మీకు సరైన దేవుని బోధ చేసే వారు మీ దగ్గర ఉండి ఉండకపోవచ్చు. మీకు దేవుని జ్ఞానము నేర్పించేవారు మీయొద్ద లేకపోతే, మీరు మరణించిన తరువాత ఎక్కడికి వెళతారో మీకు తెలియకపోతే అది మీకు మీ ఆత్మకు చాలా ప్రమాదం. కనుక ఇప్పటికైనా దృష్టించి, మొట్టమొదట మీరు చేయాల్సిందల్లా యుక్రెయిన్ తో ఈ యుద్ధమును వెంటనే నిలిపివేయండి. మీ ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షించుకొనుటకు దేవుని మార్గమును స్వీకరించండి. అలాగే, మీరు పరిపాలిస్తున్నటువంటి రష్యా దేశమంతటిని ఒక అధ్యక్షునిగా దేవుని మార్గములో నడిపించండి.
ఎన్నో అంతర్గత సమస్యలతో మీ దేశము కూడా భయానక వాతావరణములోనే ఉన్నది కదా. ప్రజలకు మూడు పూట్ల తిండి పెట్టాలి, వారి బాగోగులు చూడాలి. ప్రజలను దేవుని మార్గంలో, చక్కని న్యాయమైన మార్గంలో నడిపించాలి. ఉగ్రవాద సమస్యలు, వైరస్ సమస్యలు, లంచగొండితనం, వ్యభిచారం, దొంగతనం.. ఇటువంటి పలు సమస్యలు ఆయా దేశాలలో అంతర్గతంగా ఉండనే ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించుకుంటూ, కేవలం దేవుని మీద ఆధారపడుతూ ఆత్మ విమర్శ చేసుకొని దేవుని వైపు మీ మనసును మలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇది మీకూ మంచిది; మీరు పరిపాలిస్తున్న దేశానికీ మంచిది. దేవుడు మిమ్మును దీవించును గాక.
Russia Ukraine War Crisis – Message from God to Mr. Volodymyr Zelenskyy
యుక్రెయిన్ దేశ అధ్యక్షునికి దేవుని పక్షాన దేవుని సంగతులను తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, మీ ప్రవర్తనను దేవుని వాక్యమునకు అనుకూలముగా మార్చుకోవాలి. మీరు నాటో సభ్య దేశాలలో చేరాలనుకున్నప్పుడు రష్యా దేశము తెలిపినటువంటి అభ్యంతరాన్ని మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీరు ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. మీ దేశాన్ని పరిపాలించుకుంటూ ఎవరితోనూ ఎటువంటి బేధాలు లేకుండా మనుషులందరితో సమాధానముగా ఉంటూ దేవుని వాక్యమునకు పెద్దపీట వేసారా, లేదా? మీ దేశానికి అనేక మంది వస్తున్నారు. వారందరికీ వైద్య విద్య, ఇంజనీరింగ్ విద్య, ఇతరమైన విద్యలను నేర్పుతున్నారు. కానీ, దేవుని విద్యను నేర్పించగలుగుచున్నారా? అసలు మీ దేశంలో దేవుని వాక్యమును ఉన్న స్థానం ఏమిటి? రష్యా మీతో యుద్ధం ప్రారంభించింది, పరిస్థితి చేయి దాటిపోయింది. భయంకరమైన, విధ్వంసకరమైన యుద్ధ వాతావరణము లోనికి మీతో పాటు మీ దేశ ప్రజలందరూ, సైనికులందరూ వెళ్ళిపోయారు. ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికైనా సరే, మీ మనస్సు దేవుని వైపు మళ్లాలని నేను కోరుకుంటున్నాను.
మీ చుట్టూ ఉన్నటువంటి యూరప్ దేశాల యొక్క సహాయాన్ని మీరు కోరుకుంటున్నారు. అమెరికా యొక్క సహాయమును మీరు కోరుకొంటున్నారు. వారేదో వచ్చి మీకు సహాయం చేసి రష్యాను నిలువరించాలని మీరు కోరుకుంటున్నారు గాని మీకు మీరుగా మీ దేశము తరఫున దేవుని మీద ఆధారపడ గలుగుతున్నారా? దేవుని సహాయాన్ని కోరుకుంటున్నారా? చరిత్రలో ఎన్నో సందర్భాల్లో బలహీనంగా ఉన్న ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు ఉండి బలమైన రాజ్యాలను జయింప చేయలేదా? ఆ విషయం దేవునికి ఏమైనా పెద్ద సంగతా? ఒక్కసారి దేవుని ప్రార్ధించండి. ఒక్కసారి దేవుని ముందు మోకరిల్లండి. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములోని చరిత్ర సంగతులను గ్రహించండి. నిజముగా దేవుని సహాయాన్ని గనుక మీరు కోరుకుని, మీరు దేవుని మీద ఆధారపడ్డామని, దేవుడు ఈ దేశాన్ని మరల మీ చేతులకు అప్పగిస్తే మీరు దేవుని మార్గములో మీ దేశాన్ని నడిపిస్తామని ఒక చక్కని నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా మీడియా ద్వారా మీరు తెలియ చేయ గలిగితే మీకు దేవుడు విజయమును అనుగ్రహిస్తాడు. దేవుని యందలి విశ్వాసము రాజ్యములను జయిస్తుంది.
నేను మరణించినా పరలోకానికి వెళ్లాలి అనే ఆలోచన మీకు ఉందా? యేసుక్రీస్తు ప్రభువును మీరు రక్షకునిగా అంగీకరించి మీ ఆత్మను కాపాడుకోవాలనే ఆలోచన మీకు ఉందా? ఇలా మీరు ఆలోచించగలిగితే మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ప్రపంచానికి ఈ విషయాలను తెలియజేసి, మీరు దేవుని మీద ఆధారపడితే మీకు మీ దేశానికి ఎంతో మంచిది, అలా కాకుండా ఏదో మీ సొంత శక్తి మీద ఆధారపడాలని, ఉన్నటువంటి కొద్దిమంది సైనికులతో యుద్దములో ప్రతిఘటిద్దామని లేక ఇంకా ఎవరిదో సహాయం లభిస్తుందని మీరు ఎదురుచూపులు చూస్తే చివరకు మీరే నష్టపోతారు. ఇక్కడా ప్రాణాలు కోల్పోయి, పాతాళమునకు వెళ్ళిన ఆత్మ అక్కడా బాధ అనుభవించటం మంచిది కాదు. కనుక దేవుడు తెలియజేయుచున్న ఈ మంచి సంగతులను గుర్తించండి. ఇకమీదట యుక్రెయిన్ ద్వారా ప్రపంచమంతటికీ దేవుని జ్ఞానము వెదజల్లబడాలని మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు మీ పక్షాన ఉంటాడు, ఈ క్షణమే మిమ్మును రక్షిస్తాడు. మీకు ఎదురుగా వచ్చేది ఎంత పెద్ద శక్తైనా, అది ఎంత కొమ్ములు తిరిగిన దేశమైనా దాన్ని అనచడానికి దేవునికి పెద్ద పని కాదు. క్షణాల్లో నిమిషాల్లో ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలడు. కనుక మీరు దేవుని దగ్గర, ఆయన ముందు మోకరిల్లి, ఆయన సహాయమును కోరుకుంటే తప్పకుండా పరలోకము నుండి మీకు సహాయం అనుగ్రహింపబడుతుంది. ఈ విషయమును ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకోవాలని యుక్రెయిన్ దేశ అధ్యక్షుడైన జెలెన్స్కీని దేవుని పక్షమున కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మును దీవించును గాక!