Skip to content
మేము ప్రార్థన చేయునదేమనగా..
ప్రార్థన
- పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పవిత్రమైనది. నీవు మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు మరియు నిత్యనివాసివి!
- తండ్రీ, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.
- అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను మరియు నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుటయే నిత్యజీవమని మేము విశ్వసించుచున్నాము.
- తండ్రీ, మీ క్రీస్తు రాజ్యములో మేము ఉన్నామని నమ్ముచున్నాము.
- మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.
- తండ్రీ, మీ కృపతో మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి.
- మేము మా ఋణగ్రస్తులను క్షమించినట్లే మా ఋణములను కూడా క్షమించండి. మమ్మును శోధనలోనికి తేకుండా, దుష్టుని కీడు నుండి తప్పించండి.
- తండ్రీ, మా పూర్ణవిధేయతతో ఈ ప్రార్థనను మా ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను ప్రార్థిస్తున్నాము. ఆమేన్.
You must be logged in to post a comment.