నిత్యజీవ పరిశోధన 2022

Nityajeeva Parishodhana 2022

Seventh Nityajeeva Parishodhana Important Notification

Nityajeeva Parishodhana 2022 Advertisement

ఏడవ నిత్యజీవ పరిశోధన ప్రాముఖ్యమైన ప్రకటన

ఏడవ అంతర్జాతీయ నిత్యజీవ పరిశోధన 2022 జనవరి మాసము 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఈ పర్యాయము ప్రభువు చిత్తమునుబట్టి వర్చువల్ పద్ధతిలో నిర్వహించబడును. ప్రతి అంశమును మా వెబ్ సైట్ NJP 2022 Videos నందు గాని SUTOTALLY అనే మా యూట్యూబ్ లేక SUTOTALLY ఫేస్ బుక్ ఛానల్స్ యందు ఈ అవకాశము ప్రీమియర్ల రూపములో మీకు లభించును. గనుక, యావన్మంది ఆశావహులు ఈ విషయమై తగిన సిద్ధపాటును కలిగి ఉండాలని సూచించుచున్నాము.
సమయసూచిక:
మొదటి ఉపదేశము: ఉదయం 11:00 గంటల నుండి 12:30 గంటల వరకు
రెండవ ఉపదేశము: మధ్యాహ్నం 03:00 గంటల నుండి 04:30 గంటల వరకు
రోజువారి ఉపన్యాసము: సాయంత్రం 07:00 గంటల నుండి 08:30 గంటల వరకు
ఈ విధముగా జనవరి 13వ తేది నుండి 17వ తేది వరకు ఉదయపు వేళ ఐదు ఉపదేశములు మరియు మధ్యాహ్నపు వేళ ఐదు ఉపదేశములు, సాయంత్రం వేళ ఐదు ఉపన్యాసములు వర్చువల్ పద్ధతిలో నిర్వహించబడును. దేవుని వాక్యమును మీతోపాటు అనేకమందికి వినిపించి దైవజ్ఞానములో వారిని కూడా నడిపించగలరు.
సిద్ధపాటు:
వర్చువల్ పద్ధతిలో ఉపదేశములు మరియు ఉపన్యాసములను వీక్షించుటకు మీరు నివసించుచున్న ప్రాంతములో మీరు వాడుతున్న మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోండి, అలాగే మీ మొబైల్ డేటాను ముందుగా సరిపడా రీఛార్జ్ చేసుకోండి.
ఎలక్ట్రిక్ పవర్ అంతరాయము వలన ఉపదేశములు / ఉపన్యాసములు కోల్పోకుండా బ్యాటరీ/ఇన్వర్టర్/జెనరేటర్ల వంటి వాటిని ముందుగా సిద్ధపరచుకోండి.
ఇద్దరు లేక ముగ్గురు సమాజముగా కూడి, ఈ కార్యక్రమములో పాల్గొనదలచినవారు ప్రభుత్వ నిబంధనలు మేరకు సామాజిక దూరమును పాటిస్తూ, పరిశుభ్రముగా ఉంటూ ఈ కార్యక్రమములో పాలుపొంది దేవుని విలువైన వాక్యమును ఒక క్రమమైన పద్ధతిలో అభ్యసిస్తారని కోరుచున్నాము.
ఏడవ నిత్యజీవ పరిశోధన పరీక్షలు వ్రాయగోరు అభ్యర్ధులు జనవరి 13వ తేది నుంచి మీ వివరములను Scriptures University Android Application లో లేదా NJP Registration Form వెబ్సైట్ నందు నమోదు చేసుకోగలరు. నిత్యజీవ పరిశోధన 2022 పరీక్షా పత్రము నమూన కొరకు ఈ ప్రాక్టీస్ పరీక్షను వ్రాయండి. మరిన్ని వివరములకు మరియు సందేహ నివృత్తి కొరకు 8978414178 ను సంప్రదించండి. ఇందు ముఖ్య వాక్యోపదేశకులుగా స్క్రిప్చర్స్ యూనివర్సిటి ముఖ్య కార్యదర్శి మరియు క్రైస్ట్ చర్చ్ ఆసియ వర్తమానికులు దైవజనులు. మణి కుమార్ గారు ప్రసంగించెదరు.
ఆదికాలము నుండి ఆధునిక కాలము వరకు మానవ పురోగతి అంతా పరిశోధనపైనే ఆధారపడినది అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఆ పరిశోధనంతా దేనికొరకు? ఎంతవరకు?  కనిపించేదైనా కనిపించనిదైనా క్షయమైన దాని కొరకు మాత్రమే ఆలోచించే మనిషి, అక్షయమైన దాని కొరకు తన జీవిత కాలములో ఏనాడూ ఆలోచించలేదు. అందుకే మనిషిలో కనిపించే అభివృద్ధి అంతా కేవలం  మట్టి లోకానికే తప్ప, మహిమ లోకానికి మాత్రం కాదు. మనిషి ఎక్కడ నుండి ఈ భూమి మీదకి వచ్చాడన్న ప్రశ్నతో ప్రారంభమై; మరణించిన తరువాత ఎక్కడికి వెళ్లాలన్న ప్రశ్న వరకు.. అనేక ఆత్మ సంబంధమైన సందేహములకు దేవుని గ్రంధము నుండి సమాధానాలను  పరిశోధింపజేసే మహోన్నతమైన కార్యక్రమమే ‘నిత్యజీవ పరిశోధన’ అను అంతర్జాతీయ ఆన్లైన్ బైబిల్ సదస్సు!

నిత్యజీవ పరిశోధన 2022 పరీక్షల నిమిత్తము రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి క్రీస్తుయేసు ప్రభువు పేరిట శుభములు!

మీరు 23-01-2022 అనగా, ఆదివారమున (ఉదయం 09 నుండి రాత్రి 09 లోపు) 30 నిమిషముల (అర్ధ గంట) వ్యవధిలో ఆన్ లైన్ పరీక్షను వ్రాయవలసి యుండును.

పరీక్ష వ్రాయుచున్న సమయమందు రిఫరెన్సులు మరియు సమాధానముల కోసం బైబిల్ (పుస్తకము/మొబైల్/కంప్యూటర్ మొదలగు వాటిలో) మరియు నోట్ పుస్తకము వంటి వాటిలో చూచి వ్రాయకూడదు.

అలాగే, ఏ ఒక్కరి సహాయమూ తీసుకోకుండా, నీతిగా నిబద్ధతతో వ్రాయవలెను!

23-01-2022 అనగా, ఆదివారమున మీకు వీలుగా ఉండే ఏ సమయములోనైనా మీరు ఆన్ లైన్ పరీక్షను వ్రాయవచ్చును.

23-01-2022 అనగా, ఆదివారము ఒక్కరోజు మాత్రమే ఆన్ లైన్ పరీక్ష అందుబాటులో ఉండును.

ఆన్ లైన్ పరీక్ష కేవలం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటు లోనికి వస్తుంది. మిగిలిన వారు పరీక్షను వ్రాయలేరు.

పరీక్ష వ్రాయుటకుగాను మీరు ముందుగా మీ Username or Email మరియు Password లను ఉపయోగించి లాగిన్ అవ్వవలెను. ఆ తరువాత మాత్రమే పరీక్ష ప్రారంభమగును.

ఆన్ లైన్ పరీక్ష యొక్క నమూనాను ముందుగా మీరు ప్రాక్టీస్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చును. అందుచేత, వీలైనన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ పరీక్షను వ్రాయండి.

పరీక్షల నిమిత్తము ఇంకా మీకు ఎటువంటి సందేహములున్ననూ, 8978414178 అనే మా మొబైల్ నంబర్ ను సంప్రదించగలరు.

njp 2022 exams completed notice

“Delizioso”

A must try for all Italian food lovers! The best Italian restaurant I’ve ever been to! Highly recommended!

★ ★ ★ ★ ★

— Martha Nazario

“Authentic Flavour”

The pasta dishes are cooked to perfection and the sauces are full of flavour. Highly recommend!

★ ★ ★ ★ ★

— Alex Martinez

“Outstanding Pizza”

The crust is thin, the sauce is flavourful and the toppings are very fresh. Will come again for sure.

★ ★ ★ ★ ★

— Antoine Crawford

Scroll to Top

Discover more from SUTotal

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading