Devuni Peremito Telusaa దేవుని పేరేమిటో తెలుసా Do you know the name of God Sutotal

Devuni Peremito Telusaa? • దేవుని పేరేమిటో తెలుసా? • Do you know the name of God?

సర్వశక్తిమంతునిగా దేవుని తెలుసుకొనుట
యెహోవా అను పేరున దేవుని తెలుసుకొనుట
యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకొనుట
అబ్రాహాము మొదలు మోషే వరకు ఉన్న కాలములో దేవుని గూర్చి ఎలా తెలుసుకున్నారు?
మోషే మొదలు యేసు వరకు ఉన్న కాలములో దేవుని గూర్చి ఎలా తెలుసుకున్నారు?

Audio Message of Do you know the name of God • Devuni Peremito Telusaa • దేవుని పేరేమిటో తెలుసా ఆడియో సందేశము

మా పరిచర్యను గూర్చి..

సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!

About Our Ministry..

Welcome to the website where you can discover the Word of God delivered by Brother Mani Kumar. You can view our video sermons on our YouTube account, CHRIST CHURCH ASIA. Keep hearing these messages to the very end. If possible, while listening to our sermons, please keep the Holy Bible in your hand to study what we have provided. If you find these films helpful in your spiritual growth, share them with as many people as possible. We update this website and our YouTube channel with the most recent and important stuff every day. We hope you will continue to acquire God’s wisdom through these videos and profit spiritually from this ministry. We’re hoping you hear back in the name of our Lord and Savior Jesus Christ!

మీరు లోకార్పణకా? దైవార్పణకా?

సోదర సోదరీమణులారా! క్షణం తీరికలేని మీ దైనందిన జీవితంలో కేవలం పది నిమిషాలు ఈ పత్రిక చదవడానికి కేటాయించగలరని సవినయముగా కోరుకుంటున్నాము. మొదటిగా, ఈ పత్రిక ద్వారా మీనుండి ఏదో ఆశించాలనిగాని, మిమ్మును ఒక మతములో కలుపుటకు కాదని గమనించగలరు. కేవలం మానవతా దృక్పధముతో, మాకు తెలిసిన సంగతులను తోటివారికి తెలియజేయాలనే సదుద్ధేశముతో మాత్రమే ఈ పత్రికను ప్రచురించుచున్నాము.

ప్రస్తుత లోకము యొక్క పరిస్థితి

ఈ లోకములో ఎన్నో పరిస్థితులు మనలను నిరంతరము ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఆకర్షించిన తరువాత వాటికి బానిసగా మార్చుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనవి- మద్యపానం, మత్తు పదార్ధాలు, తీవ్రవాదం, సినీ మీడియా, వ్యభిచారం, దొంగతనం, అధికారం, ధన సంపాదన, క్రీడలు, నిరక్ష్యరాస్యత… మొదలగునవి. ప్రారంభంలో ఇవన్నీ చూడముచ్చటగా ఉన్నా, కాలక్రమేణా అవి మన పాలిట శాపమై, ఒక భయంకరమైన చెరలోనికి తీసుకుపోతున్నాయి. ఈ ఉచ్చు పూర్తిగా బిగిసిన తరువాత ఈ ఆకర్షణ కాస్తా వికటించి ఇవి మనలను చంపేస్తున్నాయి. అయితే, వీటిని అడ్డము పెట్టుకొని వీటి వల్ల నాలుగు రూపాయలు వెనకవేసుకునే స్వార్థపరులు మన సమాజములో ఉండటంచేత, ఎవరూ వీటి ఆగడాలను ప్రశ్నించలేకున్నారు.

ఎవరి దందా వారిదే!

ఉదాహరణకు, మద్యపానం వల్ల ముఖ్యంగా ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోజుకు ఒక సగటు కూలి సుమారు రూ.500 సంపాదిస్తే, దానిలో రూ.200 ఈ మద్యానికే చెల్లించాలి. ఇది ప్రారంభ దశ! ఆ తరువాత తెచ్చుకున్న కూలి డబ్బులన్నీ దానికే సమర్పించాలి. ఇకపై దానికి బానిసై, చేతిలో పైసా లేనప్పుడు కూడా మద్యం త్రాగడానికి అప్పు చేయాలి, ఉన్నదంతా అమ్ముకోవాలి, కుటుంబాన్ని రోడ్డుకీడ్చాలి. అలాగని, ఈ మద్యపానం వల్ల వ్యక్తిగతంగా తనకేమైనా ఉపయోగం ఉంటుందా? నడి నెత్తి నుండి అరికాలు వరకు అన్నీ నష్టాలే! నేను త్రాగితే నా బాధలన్నీ మర్చిపోతాను అనుకుంటాడు కానీ, అక్కడ జరుగుచున్నదేమిటంటే, త్రాగిన వారికి మెదడు మొద్దు బారుతుంది. సరిగా ఆలోచించనివ్వదు. శరీరం తమ అదుపు తప్పుతుంది. అడుగులో అడుగు పడదు. గుండె పనితీరు నెమ్మదిస్తుంది. కాలేయం కుంటుపడుతుంది. మూత్రపిండాలు మూలనపడతాయి. పూర్తిగా శరీరం నాశనం ఆవుతుంది. దీని గూర్చి పరిశుద్ధ గ్రంథమనే బైబిల్‌లో వ్రాయబడిన విషయాలు ఒక్కసారి చదవండి!

దాక్షరసము మిమ్మును వెక్కిరింతలపాలు చేయును. మద్యము అల్లరి పుట్టిస్తుంది.  సామెతలు గ్రంథము 20 : 1
మద్యము కలుపుటలో తెగువ గలవారికి శ్రమ. యెషయా గ్రంథము 5 : 22

స్వార్థం తెలియని దేవుడు తన మాటలలో నిర్మొహమాటంగా వ్రాయించాడు. కానీ, ఈ రోజు మన ప్రభుత్వాలు ఎందుకు ఈ ప్రజలను కట్టడి చేయడం లేదు? ఇలా మనం ప్రశ్నిస్తే- మద్యం సీసాలమీద ‘దానిని త్రాగితే ఆరోగ్యానికి హానికరం’ అని అతి చిన్న అక్షరాలతో వ్ర్రాస్తున్నాం కదా అంటారు. ఎంత మోసం? మద్యాన్ని తయారీ చేయించి, దుకాణాలు పెట్టించి, వాటికి అత్యధిక ధరను నిర్ణయించి పేద ప్రజలకు అమ్మేదీ వీరే! అది త్రాగొద్దనీ, త్రాగి వాహనాలు నడిపితే జైలులో వేస్తామనీ చెప్పేదీ వీరే! దీని కొరకు ప్రత్యేకంగా ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంటు, మద్యం షాపులకు లైసెన్సులు జారీ, అందులో భారీ కుంభకోణం. ఇంతకీ మీకొక విషయం తెలుసా? 25 ఫిబ్రవరి 2015 ‘ది హిందూ దిన పత్రిక’ విజయవాడ ఎడిషన్‌ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంటుకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన లాభం అక్షరాల రూ. 25 వేల కోట్లు! ఆశ్చర్యంగా ఉందా? అందుకే ఎవ్వరూ మద్యపానాన్ని నిషేదించరు! ఎన్నికల వాగ్ధానాలలో తమ ఎజెండాలో ఇది మాత్రం చెప్పరు! దీని కోసం కూడా దేవుడు ముందుగా వ్రాయించాడు. మతం అని భావించకుండా సమాజాన్ని మేల్కొలిపే మాటలుగా వీటిని చదవండి!

మద్యముతో మత్తులై ఉండకండి. దానిలో దుర్వ్యాపారము కలదు. ఎఫెసీయులకు 5 : 18

ఇలాంటిదే మరొకటి సినీ మీడియా! చూడడానికి రంగుల ప్రపంచం. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా తీరిక దొరికిందంటే ఏదో ఒక సినిమా ధియేటర్‌కి వెళ్లాలి, లేదా బుల్లితెరలో చూడాలని అనుకుంటారు. మొదట నెమ్మదిగా ఆకర్షించి, ఆ తరువాత ప్రతి సినిమాను మీచేత చూచేలా చేసి, తరువాత సినిమా చూడకపోతే ప్రాణం తీసుకోవాలి అనిపించేలా మిమ్మల్ని చెరపడుతుంది. ఎంతోమంది యువతకు నేడు మన రంగులు పూసుకున్న హీరోలు, హీరోయిన్లే ఆదర్శం కాదంటారు? గాంధీ మహాత్ముడు, మదర్‌ థెరిస్సా వంటి వారి పేర్లు ఎప్పుడో నేటి తరం యువత మరిచిపోయారు. వారిని ఆదర్శంగా తీసుకునేవారు ప్రస్తుతం ఎవరున్నారు? సినీమీడియాలో ఎంత మోసకరమైన కార్యక్రమాలు జరుగుతాయో తెలుసా? ఒక వైపు ధాన్యం పండిరచడానికి గుప్పెడు విత్తనాలు దొరకక, రైతు విలవిల లాడుతుంటే, సుమారు రూ.1000 నుండి 2000 కోట్ల రూపాయలతో భారీ సినిమాలను నిర్మిస్తున్నారంటే, మన సమాజపు పరిస్థితి ఎలా ఉందో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. పోనీ ఈ సినిమా ఏమైనా సమాజాన్ని ఉద్ధరిస్తుందా?

సినీ మీడియా దేశం కోసమా? ధనం కోసమా?

ఉదాహరణకు, ఆ మధ్య మగధీర అనే పేరు కలిగిన సినిమా కోట్ల రోపాయల కలెక్షన్‌ రాబట్టింది. ఇంతకీ దానిలో ఉన్న కథ ఏమేమిటంటే, ఒక జన్మలో విడిపోయిన ప్రేయసీ ప్రియులు మరో జన్నలో అదే రూపాలతో కలుసుకుంటారు. ఇది నిజమంటారా? ఇది  ఎక్కడైనా జరిగినట్టు దాఖలాలు ఉన్నాయా? సదరు కథా రచయితకు లేక దర్శకునికి జన్మ తరువాత మరో జన్మ ఉందని అంత ఖచ్ఛితంగా ఎలా తెలుసు? ఇలాంటి కథల వల్ల జరిగే అతి భయంకరమైన ప్రమాదం చెప్పమంటారా? ఎంతో మంది నిర్భాగ్యులైన ప్రేమికులు ఇలాంటి కథలు నమ్మి, సినిమాలు చూసి ఈ జన్మలో వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోక, వారి ప్రేమ ఫలించక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎందుకు ఇంత అఘాయిత్యానికి తెగిస్తున్నారంటే, వచ్చే జన్మలో ఈ సినిమాలలో చూపించినట్లుగా మేము కూడా కలిసిపోతాము. ఈ జన్మలో ఫలించని మా ప్రేమ, వచ్చే జన్మలోనైనా ఫలిస్తుందని వారి గ్రుడ్డి నమ్మకం. ఇలా సినీ నిర్మాణకులు మొదలుకుని సెన్సార్‌ బోర్డ్‌ వరకు ప్రతి ఒక్కరూ వారి స్వలాభం కోసం అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దేవుని మాటను ఒక్కసారి వినండి.

ఈ లోకపు నటన గతించుచున్నది. 1కొరింథీయులకు 7 : 31
వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. యోబు గ్రంథము 21 : 11,12

ఇలా చెప్పుకుంటూ పోతే, సమాధానములు దొరకక, ప్రతి విషయములోను దేవుని మాటలనే ఒప్పుకోవలసిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. ఇకనైనా మీరు మార్పును కోరుకోవాలి. అత్యవసరంగా దేవుని మాటను వెదకాలి. కేవలం దైవార్పణ కొరకే మీ జీవితం ప్రారంభింపబడినది. దేవుని మార్గములో చెడుతనము లేదు. నిజమైన దైవభక్తిలో చెడు వ్యాపారము లేదు. దేవుని వాక్యమును వినే విషయంలో మి ఆత్మకు ఆరోగ్యాన్నిచ్చే హిత వాక్యమునే మీరు వినాలి. దీని వలన భూమి మీద మీ శరీరాన్ని కాపాడుకుంటూ, ఆ శరీరాన్ని దేవుని కార్యక్రమాలలో వాడగలరు. ఒకవేళ వక్రీకరింపబడిన బోధ బోధిస్తూ, కుయుక్తి కలిగిన అబద్ధ బోధకుల ఉచ్చులో మీరు చిక్కుకునే దానికంటే, అసలు ఇటువైపు రాకుండుటే మంచిది. అందుకే మీ చేతికి వచ్చిన ఈ పత్రిక మీకు చేప్పే ఈ మేలైన సందేశాన్ని విని, దేవుని అసలుసిసలైన మహాజ్ఞానాన్ని నేర్చుకొనుటకు కదలిరండి. ఇప్పటికే ఎంతోమందిని దైవార్పణకై ప్రోత్సహించి, దేవుని సేవలో నిర్విరామంగా ముందుకు కొనసాగుతున్న మమ్మును సంప్రదించండి. ఒక ఆత్మగా, మిమ్మును మీరు రక్షించుకోండి!                                               

వివరములకు: దైవజనులు మణికుమార్‌ క్రైస్ట్‌ చర్చ్‌, ఆసియ.

Are you a World’s Offering or God’s offering?

Brothers and sisters! We sincerely hope that you can spare just ten minutes of your daily life to read this magazine. First of all, please note that this magazine is not to expect anything from you, but to join you in a religion. We are publishing this magazine only with a humanitarian point of view and with the intention of informing our peers about what we know.

Present Situation of this world

Many situations in this world are constantly attracting us. After attracting them they are making them slaves. Important among these are- alcoholism, drugs, terrorism, film media, adultery, theft, power, money making, sports, indifference etc. Although all these are delightful in the beginning, in course of time they become the bane of our hearts and lead us into a terrible captivity. After this trap is fully tightened, this attraction is slightly distorted and they are killing us. However, due to the presence of selfish people in our society who block these and withdraw four rupees because of these, no one is able to question these stops.

Nobody hears God

For example, many poor families are on the road due to alcoholism. If an average laborer earns around Rs.500 per day, out of which Rs.200 should be paid to this person. This is the beginning! After that all the wages earned should be submitted to it. No longer addicted to it, even when there is no money in hand, one has to go into debt to drink alcohol, one has to sell everything one has, one has to leave one’s family on the road. So, does this drinking have any benefit for him personally? From the scalp to the soles, everything is a loss! He thinks that if I drink, I will forget all my troubles, but what happens there is that the brain becomes numb to those who drink. It does not allow you to think properly. The body goes out of control. Step by step does not fall. Heart rate slows down. The liver becomes paralyzed. Kidneys are cornered. The body is completely destroyed. Just read what is written in the Holy Book about this!

Wine makes you sneer. Alcohol is riotous. Proverbs 20:1
Toil for those afflicted with mixing alcohol. Isaiah 5:22

God, who knows no selfishness, wrote in His words plainly. But, why are our governments not binding these people today? If we ask like this, they will say, ‘If you drink it, it is harmful to your health’, we are writing in very small letters on the bottles of alcohol. How much fraud? They are the ones who make liquor, set up shops and sell it to the poor people at the highest price! They are the ones who say don’t drink it, if you drive drunk you will be put in jail! For this purpose, the Excise Department specially issued licenses to liquor shops, and there is a huge scandal in it. Do you know something? According to the 25th February 2015 Vijayawada edition of ‘The Hindu Dina Patrika’, the revenue generated by the sale of liquor to the Andhra Pradesh government is Rs. 25 thousand crores! Is it surprising? That’s why no one bans alcohol! They do not say this in their agenda in the election promises! God foreordained for this also. Read these as words to wake up the society without thinking of it as religion!

‘Do not be intoxicated with alcohol. There is abuse in it. Ephesians 5:18’

This is another movie media! A colorful world to see. If you have free time without discrimination, you have to go to a movie theater or watch it on the big screen. At first it draws you in slowly, then makes you watch every movie, and then if you don’t watch the movie, you feel like you have to kill yourself. Aren’t the heroes and heroines who are wearing our colors the ideals for many young people today? The names of Mahatma Gandhi and Mother Teresa have been forgotten by the youth of today. Who are their role models today? Do you know how many scams are going on in Cinemedia? On the one hand, if the farmer is not getting a bunch of seeds to grow grain, and they are making huge movies with around Rs.1000 to 2000 crore rupees, then you have to understand the condition of our society. Pony will this movie uplift the society?

Everyone is Selfish

For example, a movie titled Magadheera collected crores of rupees. So what is the story in it, lovers who are separated in one life meet in the same forms in another life. Is this true? Are there any records of this happening anywhere? How does the writer or the director know for sure that there is another birth after birth? Can you tell me the most terrible accident that happens due to such stories? Many unlucky lovers believe such stories and watch movies and die by suicide because the elders do not accept their love in this life and their love is not fruitful. Why are you trying so hard, in the next life we ​​will be together as shown in these movies. Their blind belief is that our love, which does not bear fruit in this life, will bear fruit in the next life. Starting from the film producers to the censor board, everyone is sacrificing innocent people for their own gain. Now listen to the word of God.

Awake and Arise to condemn the Bad

That being said, there are many times when answers cannot be found and God’s word must be accepted in every matter. You have to want change anyway. Seek the word of God urgently. Your life was started only for God’s offering. There is no wickedness in God’s way. There is no evil business in true godliness. When it comes to listening to the word of God, you should listen to the good word that brings health to your soul. This allows you to preserve your body on earth and use that body in God’s work. It is better not to come this way than to fall into the trap of crafty false teachers teaching a distorted teaching. Therefore, listen to this excellent message that this magazine brings to your hands and move to learn the true wisdom of God. Contact us who have already encouraged many people to be God’s offering and are moving forward relentlessly in God’s service. As a soul, save yourself!

For details: Man of God – Manikumar, Christ Church Asia.
Devuni Peremito Telusaa దేవుని పేరేమిటో తెలుసా Do you know the name of God Sutotal

Program Name: Answers form God (ఉత్తరము)

Topic: Devuni Peremito Telusaa? • దేవుని పేరేమిటో తెలుసా? • Do you know the name of God?

Date: 07/01/2025

Scroll to Top

Discover more from SUTotal

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading