Skip to content

భూమిలో నుండి సత్యము మొలుచును;ఆకాశములో నుండి నీతి పారజూచును. కీర్తనలు 85 : 11

దేవుడు ఈ భూమిని సృష్టించాడు. దేవుని కృపనుబట్టి ఈ భూమి ఫలవంతమైనదిగా మనుష్యులకు ఆహారమును ఇచ్చుచున్నది. భూమి మొలిపించుచున్న ఆహారమును గమనిస్తే అది మనుష్యులకు ఆరోగ్యకరమైనదిగా కనిపించుచున్నది. ఎన్నో యేళ్లుగా ఈ భూమి దేవుని వాక్యమును బట్టి ఫలించుచు మనుష్యులకు సత్యమును నేర్పుచున్నది. ఆ సత్యమేమనగా, ప్రతి మనిషి దేవుని వాక్యమునుబట్టి దేవుని క్రియలను చేయుచు దేవుని కొరకై ఫలించాలి. సత్యమును అనుసరించి తన జీవితకాలమంతయు నీతిన్యాయములను విడువక, యథార్ధతను ప్రేమించి దేవుని మార్గములో నడచుకోవాలి. మనిషి తాను చేసిన పాపములను దేవుని యెదుట ఒప్పుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నొంది క్రీస్తువలె జీవించాలి.
దేవుడే ఆకాశమును పరమాకాశములను సృష్టించాడు. మనకు కనిపించుచున్న ఆకాశము కూడ దేవుని కృపనుబట్టి మనుష్యులకు అవసరమైన వర్షమును కురిపించుచు, విస్తారమైనవాటికి నివాసమై మనుష్యులకు నీతిని తెలియజేయుచున్నది. మనము పైనున్నవాటిని, అనగా నిత్యత్వమును వెదకవలెనని మనకు జ్ఞాన బోధ చేయుచున్నది. ఆకాశములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మరియు వాటి ఉపగ్రహాలు ఒక నిర్ణీత కక్ష్యలో, ఒక నిర్ణీత వేగముతో దేవుని వాక్యమును అనుసరించి క్రమబద్ధముగా సంచరించుచు మనిషి కూడ అటువలె దేవుని కొరకు బ్రదకవలెనని నీతిని ప్రబోధించుచున్నది.

Truth shall spring out of the earth; and Righteousness shall look down from heaven. Psalms 85 : 11

God created this earth. By the grace of God, this earth is fertile and provides food for mankind. If you look at the food that the earth produces, it looks healthy to humans. For many years this earth has been teaching the truth to men that we should be fruitful according to the word of God. The truth is that every man should do the works of God according to the word of God and be fruitful for the sake of God. One must follow the truth and walk in the way of God, loving righteousness, and not forsaking righteousness all his life. Man must confess his sins before God and live as Christ with the forgiveness of sins in the name of the Lord Jesus Christ.
God Himself created the Sky and the other spaces. The Sky which we see also, by the grace of God, pours down rain on mankind, and as the abode for abundant, declaring righteousness to men. Sky teaches us Wisdom that we must seek the above, that is, eternity. The sun, the moon, the stars, the planets, and their satellites in the sky move in a fixed orbit at a certain speed, following the Word of God regularly and teaching us that we must follow the same criteria.

Time to Explore More..

Explore our views and methodology of spirituality that lead through a variety of good habitats and observe the change in personality development.

Bible Study Sutotal
Bible Study