Reforming Society with the Word of God!
Welcome to our Home Page. We believe that the Word of God is an Ultimate Medicine to recover this Society from the darkness of evil.
సత్యము – నీతి
భూమిలో నుండి సత్యము మొలుచును
ఆకాశములో నుండి నీతి పారజూచును.
సత్క్రియలు
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
వ్యక్తిత్వం
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని
మరి దేనికిని పనికిరాదు.
సత్యము – నీతి
Welcome to our Home Page. Truth shall spring out of the earth; and Righteousness shall look down from heaven.
సత్క్రియలు
How beautiful upon the mountains are the feet of him that brings good tidings, which publishes peace; that brings good tidings of good, that publishes salvation; that says unto Zion, Your God reigns!
వ్యక్తిత్వం
All of you are the salt of the earth: but if the salt has lost its savor, wherewith shall it be salted? It is thenceforth good for nothing, but to be cast out, and to be trodden under foot of men.
God’s Work is Our Prime Importance…
“నేను దేవుని నమ్మితిని, అది నాకు నీతిగా యెంచబడెను” – అబ్రాహాము
“I believed in God, and it was counted to me as righteousness” – Patriarch Abraham
“నేను దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉంటిని” – మోషే
“I am faithful in the entire God’s house” – Leader Moses
“నేను దేవుని ఇష్టానుసారునిగా జీవించితిని” – దావీదు
“I lived according to God’s will” – King David
“నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే – చావైతే లాభము” – యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు
“For to me, to live is Christ and to die is gain.” – Paul the Apostle of Jesus Christ
“పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు నాకు ఇయ్యబడెను” – యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు
“I have been given the keys of the kingdom of heaven” – Peter the Apostle of Jesus Christ
“నేను క్రీస్తునందలి విశ్వాసముతో ఈ లోకమును జయించిన విజయుడను” – యేసుక్రీస్తు అపొస్తలుడైన యోహాను
“I am an overcomer of the world by the faith in Christ” – John the Apostle of Jesus Christ
Let’s work together for our Kingdom of God
ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై యున్నాము. రోమీయులకు 12 : 4 – 5
ప్రారంభ శతాబ్ధపు క్రైస్తవ్యం
పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెను. యూదా పత్రిక 1:3
ప్రియులారా! పూర్వకాలమందు నానాసమయములలోను నానావిధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ అంత్యదినములలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారిద్వారా మనతో మాటలాడెను. ఆ మాటలు కలిగిన పుస్తకమే పరిశుద్ద గ్రంథము లేక బైబిల్. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వము సంపూర్తి చేయబడిన ఈ బైబిల్‌ను సుమారు 40 మంది ప్రవక్తలు, నీతిమంతులు ఆయా కాలాలకు, ప్రదేశములకు చెందినవారై, దైవావేశము వలన వ్రాసిరి.
బైబిల్ విషిష్టత
దేవుని సంకల్పానుసారము మన చేతిలోనికి వచ్చిన ఈ గ్రంథము ఆదిమ హెబ్రీ, గ్రీకుభాషలలో నుండి తెలుగు లోనికి తర్జుమా చేయబడినది. పైగా జాన్ గ్యూటన్‌బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తరువాత ముద్రించిన తొలి పుస్తకముగా, ప్రపంచంలోని అత్యధికముగా అమ్ముడయ్యి, అసంఖ్యాక పాఠకులను దాదాపు అన్ని భాషలలో కలిగి ఉన్న రాజ గ్రంథముగా చరిత్రకెక్కినదే బైబిల్. ఇంతటి విశేష ప్రాముఖ్యతను కలిగి ఉన్న బైబిల్, ప్రస్తుతం అపాయకరమైన పరిస్థితుల లోనికి వెళ్లిపోయింది. ఆశ్చర్యంగా ఉందా? ఈ అపాయం, పాఠకులు తగ్గిపోవడం వల్లనో, పుస్తకం అంతరించి పోవడం వల్లనో వచ్చినది కాదు. ఈ బైబిల్‌లో ఉన్న ఒక్కటైన బోధ నేటికి 3000 రకాలకు పైగా చీలిపోయి, కుక్కలు చింపిన విస్తరిలా మారిపోవడమే!
ఒక్కటిగా ఉండవలసిన బైబిల్ బోధ
మొదటి శతాబ్ధములో భక్తుడైన పౌలు, ఎఫెసులోని క్రైస్తవ సంఘానికి పరిశుద్దాత్మ ప్రేరణచేత లేఖను వ్రాస్తూ, పరిశుద్ద గ్రంథమును చదివే క్రైస్తవుల నిరీక్షణ, విశ్వాసము మరియు బాప్తిస్మము ఒక్కటిగా ఉండాలని కోరుకున్నాడు. దేవుని ఆశలపై నీళ్లు చల్లుతూ, ఆయన అనాది సంకల్పాన్ని సమాధి చేస్తూ ఒక్కటే బైబిల్‌ను, ఒక్కడే క్రీస్తును, ఒక్కడే తండ్రిని కలిగి ఉన్న నేటి నామాకార్ధ క్రైస్తవులు ఇన్ని వర్గాలుగా, శాఖలుగా చీలిపోవడానికి కారణమేమిటి? ఒకరి విశ్వాసం ఒకటి, మరొకరి విశ్వాసం మరొకటి. ఒకరి బోధ ఒకటి, మరొకరి బోధ మరొకటి!
ఉదాహరణకు:
- క్రైస్తవులకు పండుగలు లేవని కొందరంటే, ఉన్నాయని మరికొందరు!
- దశమ భాగం ఇవ్వమని కొందరంటే, మీకు తోచినది ఇవ్వమని మరికొందరు!
- తెల్లని దుస్తులే ధరించాలని కొందరంటే, గడ్డాలు మీసాలు తీసేయాలని మరికొందరు!
- సంఘముగా శనివారమున కూడుకోవాలని కొందరంటే, ఆదివారమునే కూడుకోవాలని మరికొందరు!
- వెయ్యేండ్ల పరిపాలన జరుగుతున్నదని కొందరంటే, జరగబోతున్నదని మరికొందరు!
- నీటిలో ముంచబడి బాప్తిస్మము పొందాలని కొందరంటే, చిలకరింపు చాలని మరికొందరు!
నాటి నుండి నేటి వరకు..
ఇలా ఎవరి బోధ గొప్పదంటే వారి బోధ గొప్పదనుకుంటూ, ఎవరికివారు డప్పుకొట్టుకుంటూ, దొరికినంత దోచుకుంటూ, క్రొత్తగా క్రైస్తవ విశ్వాసము లోనికి వచ్చిన అనేకమందిని తమ మోసపు మాటలతో, ఒక్కటైన బోధకు దూరం చేస్తున్నారు. క్రైస్తవ్యంలోనికి ఈ జబ్బు, మొదటి శతాబ్ధములోనే అనగా యేసుక్రీస్తు మరణించి, తిరిగి లేచి, పరలోకానికి ఆరోహణుడయిన అనతి కాలములోనే, భిన్నమైన సువార్తగా, సంఘముల లోనికి ప్రవేశించింది. అలా ప్రవేశించిన తప్పుడు బోధలకు ఏమాత్రం ఒప్పుకోవద్దని పౌలుగారు, గలతీ ప్రాంతమందున్న సంఘానికి వ్రాసారు. గలతీయులకు 1 : 6-9. నాడు ప్రారంభమైన అబద్ధబోధలు నేటికి మూడు పువ్వులు, ఆరుకాయలుగా విరాజిల్లుతున్నాయి. ఈ అబద్దపు బోధలనుండి మానవ ప్రపంచం తప్పింపబడే మార్గమేది? అసలు ఉందంటారా?
పరిష్కారము
మనస్సుంటే మార్గముంది అన్న చందాన, తప్పకుండా దీనికి పరిష్కారము ఉంది! పరలోకపు తండ్రియైన దేవుడు తన గ్రంథములోనే ఈ అబద్దహ్ బోధలనే విషానికి విరుగుడు చూపించాడు. ప్రారంభ శతాబ్ధంలో బోధింపబడిన ఆ ఒక్కటైన బోధలోనికి మరల మనము వెళ్లాలంటే ఉన్న ఏకైక మార్గం, మన చేతిలో ఉన్న బైబిల్‌ను మనము పరిశోధించడమే! మన చేతిలోనే పరిశుద్ద గ్రంథము ఉండగా మనలను మోసగించేదెవరు? మనుష్యబోధలు మనకు మార్గదర్శకం కాదు. ఆ బోధ బైబిలును అనుసరించినప్పుడే అది స్వీకరించుటకు అర్హమైనది. ప్రారంభ శతాబ్ధంలో పౌలు, సీల యంతటి వారైనా, వారు చెప్పిన బోధ, వ్రాయబడిన లేఖనానుసారముగా ఉందో, లేదోనని పరిశోధించిన బెరయ పట్టణస్థులు ఘనులనబడ్డారని మీరెప్పుడైనా చదివారా? అపొస్తలుల కార్యములు 17:10-11
మేలుకో క్రైస్తవుడా!
ఓ నామకార్థ క్రైస్తవులారా, బహుపరాక్! మీచేతిలో ఉన్న దైవగ్రంథమును పరిశీలించండి. యెషయ 34:16. బైబిల్‌లో ప్రశ్న వస్తే, బైబిల్‌లోనే సమాధానమును వెదకండి! మనుష్యుల కల్లబొల్లి కబుర్లతో కూడిన ఇహలోకజ్ఞానము మనకు సరైన సమాధానమును ఇవ్వదు! మన క్రీస్తుయేసు తప్ప, మనుష్యలందరూ పాపము చేసినవారే! కనుక ఇకనైనా మేల్కొనండి! మీరు ఏ సంఘానికి చెందినవారైనా, ఏ సంస్థకు చెందిన వారైనా, మీ సంఘాలను వదలివేయమని మేము చెప్పము. కానీ, బైబిల్‌ను పరిశోధించి, అబద్ధ బోధలను మాత్రం ఖండించండి. పరలోకపు తండ్రి ఆశయాలను, క్రీస్తు ప్రభువు త్యాగాన్ని బ్రతికించండి! మాతో చేయి కలిపి 2000 సంవత్సరాల నుండి నెమ్మదిస్తున్న క్రీస్తు విప్లవాన్ని మరల ముందుకు నడిపించండి. ‘‘ప్రపంచ క్రైస్తవ్యం బాగుపడాలంటే ముందు మనలో మార్పు రావాలి’’ అనే నినాదంతో సంఘాలలో ఉన్న క్రైస్తవులందరికీ ఒక్కటైన బోధను అందించుటకు, వారిని దైవజ్ఞానంలో నడిపించుటకు వెలసినదే… క్రైస్ట్ చర్చ్ – ఆసియ (స్క్రిప్చర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి అనుబంధసంస్థ)
మరిన్ని వివరములకు / ఉచిత జ్ఞానాభ్యాసము కొరకు… దైవజనులు. మణికుమార్, ఛీఫ్ రిప్రజెంటేటివ్, లీడర్, క్రైస్ట్ చర్చ్ ఆసియ మరియు స్క్రిప్చర్స్ యూనివర్శిటి. మొబైల్: 8978414178.
First Century Christianity
You must fight for the teaching that was once delivered to the saints. Jude 1:3
Beloved! God, who spoke to our fathers through prophets at various times and in various ways in the past, has spoken to us through His Son Jesus Christ in these last days. The book containing those words is the Holy Book or the Bible. This Bible, which was completed about 2000 years ago, was written by about 40 prophets and righteous people belonging to those times and places, due to divine inspiration.
Bible Specificity
This book, which has come to our hands by the will of God, has been translated into Telugu from the original Hebrew and Greek languages. Moreover, the Bible has gone down in history as the first book printed after John Gutenberg’s invention of the printing press, the world’s best-seller, and the royal text that has countless readers in almost all languages. The Bible, which has such a special importance, has now fallen into dangerous conditions. Is it surprising? This danger is not due to the decline of readers or the extinction of the book. A single teaching in this Bible is today over 3000 types torn and torn apart by dogs!
Bible teaching that should be one
In the first century, the devout Paul, writing a letter inspired by the Holy Spirit to the Christian community in Ephesus, wanted the hope, faith and baptism of Christians to be one who read the Holy Scriptures. While sprinkling water on God’s hopes and burying His eternal will, what is the reason why today’s nominal Christians, who have only one Bible, only Christ, and only one Father, have split into so many sects and sects? One’s faith is one, another’s faith is another. One’s teaching is one, another’s teaching is another!
For example:
- Some say Christians don’t have festivals, others say they do!
- Some say to tithe, others to give what you want!
- Some want to wear white clothes, others want to remove beards and moustaches!
- Some people want to meet as a congregation on Saturday, while others want to meet on Sunday!
- Some say that the reign of a thousand years is happening, others say that it is going to happen!
- Some want to be baptized by immersion, others want to be sprinkled!
From then till today..
In this way, thinking that whose teaching is great, their teaching is great, and by beating and robbing as much as they can find, many people who have newly come into the Christian faith are being led away from the one teaching with their deceitful words. This disease in Christianity entered the churches as a different gospel in the first century, when Jesus Christ died, rose again and ascended to heaven. Paul wrote to the church in Galatia not to accept the false teachings that had entered. Galatians 1 : 6-9. The false teachings that started on the day have blossomed into three flowers and six flowers today. What is the way for the human world to be saved from these false teachings? Do you have the original?
Solution
If the mind is the way, surely there is a solution! God, the Father of heaven, has shown the antidote to this poison in his scriptures. The only way we can get back into the same teaching that was taught in the early centuries is to search the Bible in our hands! Who will deceive us when we have the Holy Book in our hands? Human teachings are not our guide. That teaching is worthy of acceptance only when it follows the Bible. Did you ever read that in the first century, people like Paul and Silas, who investigated whether their teachings were according to the written scriptures or not, were persecuted by the Bereans? Acts 17:10-11
O Christian, Awake!
O nominal Christians, Awake! Examine the scriptures in your hand. Isaiah 34:16. If there is a question in the Bible, look for the answer in the Bible itself! The worldly wisdom with the chatter of men does not give us the right answer! Except our Christ Jesus, all men have sinned! So wake up soon! No matter which community you belong to, no matter which organization you belong to, we do not tell you to leave your communities. But, search the Bible and condemn the false teachings. Live the wishes of the Heavenly Father, the sacrifice of Christ the Lord! Join hands with us and start the Christ revolution which has been slowing down for 2000 years.
For More Details:
It is necessary to provide a unified teaching to all the Christians in the congregations, to lead them in the knowledge of God, with the motto “Before the world Christianity is better, we must change ourselves”… Christ Church – Asia (Scriptures Educational Society) For more details / for free education… Deivajanulu. Manikumar, Chief Representative, Leader, Christ Church Asia and Scriptures University. Mobile: 8978414178.
You must be logged in to post a comment.